పుట:Haindava-Swarajyamu.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

37

భారతభూమి ఏల నష్ట మైనది.


చదువరి : మీరు చెప్పినది సరే. ఇకముందు మీసిద్ధాంత ములు నాకు నచ్చ జెప్పుటకు ఎక్కువవాద మవసరముండదు. మీయభి ప్రాయము లెక్కువగా వినవలెనని కుతూహలము కలు గుచున్నది. ప్రస్తుత మాలోచించు చుండు విషయము మిక్కిలి చిత్తా కర్షకము. మీరు చెప్పునదంతయు సావధానముగా నిందును. అనుమానమంకురించిన చోటమాత్రము ప్రశ్నింతును.


సంపా : మీరు ఉత్సాహము పలుకుటదప్ప మున్ముందు ఎక్కువ భేదాభిప్రాయములు కలుగునని నాకుదోచుచున్నది. మీరు ప్రశ్నించునప్పుడు నావాదము చెప్పుకొందును గాగ . మనము ప్రోత్సాహ పరచినందు వలన నే బ్రిటిషువర్తకులు భారత భూమిలో కాలూన గలిగిరని ఇదివరలో చెప్పితిని. మన రాజులు వారిలో వారు పోట్లాడి కొనినప్పుడు తమతమబలమును వృద్ధి చేసికొనుటకు వారు వారు కుంపుణీ బహదూరుసహాయము కోరిరి. ఆకుంపిణీ వ్యాపారము నందును యుద్ధము నందును సమర్థమయి యుండినది. ధర్మసందేహములు దానికి కలిగినవి గావు. తన వ్యాపార మభివృద్ధి చేసికొనుట, ద్రవ్యము గడించుట, ఇవి రెండే దాని యాలోచనలు.. కాబట్టి అదిమనసహాయమును అంగీక రించి తనకు చెందిన వ్యాపార స్థానముల నెక్కువ చేసి కొనెను. ఈవ్యాపార స్థానముల సంరక్షణార్థమై కుంపిణీవారు సైన్యమును పెట్టుకొనిరి. ఆ సైన్యమును మనము కూడ వినియోగ పరచు