పుట:Haindava-Swarajyamu.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
36

హైందవ స్వరాజ్యము.


నిజమేమో విచారింతము. మొదట వారు మనదేశమునకు వచ్చినది వ్యాపారము చేసికొనుటకు. తరువాత కంపెనీ బహ దూ రేర్పడెను. కంపెనిని బహదూరు చేసినవా రెవరు.? వారు వచ్చినప్పుడు రాజ్యము స్థాపింపవలెనని వారికి కొంచమైనను ఆశ లేనే లేదు. కంపెనీవారి యధి కారులకు సాయముచేసిన దెవరు? వారు తెచ్చిన అద్దాలసొబగుచూచి మోహించిన దెవరు? వారివస్తువులను కొనిన దెవరు? చరిత్ర చూచిన యెడల ఇవన్ని యు మన మేచేసినట్లేర్పడుచున్నది. ఒక్కనాటిలో శ్రీమంతు లము కావ లెనని కుంపిణీ వారియధి కారులకు ముకుళిత కరకమల ములతో స్వాగతమిచ్చితిమి. వానికి సహాయము చేసితిమి. భంగీ త్రాగునలవాటు నాకు ఉన్నదనుకొందము దాని నమ్ము వాడు నాకమ్ముచున్నాడు. దోషము అతనిదో? నాదో? అతనిని దూరినమాత్రాన నాయభ్యాసము వదలగలనా? ఈవ్యాపారిని తరుమ గొట్టినట్లైన ఇతని స్థానమున ఇంకొక వ్యాపారి రావలసి సదే గదా ! భారతభూమికి నిజ సేపకుడైనవాడు బునాదులతో విషయము పరిశీలింపవలెను. అపరిమితముగా అన్న ముదిని యజీ ర్తి చేసికొని నీటి పైబడి నెత్తి మోది కొనిన నేమిలాభము ? మూల కారణము కని పెట్టిన నాడే ముస్తాబు వైద్యుడు. భారత భూమి నుద్ధరించు ముస్తాబు వైద్యుడను నేను అనువాడు మూలకారణమరయక తప్పదు.