పుట:Haindava-Swarajyamu.pdf/327

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయభాగము.

319

బొరిఁబొరి నుడుగక పోరంగా వారి
పక్షు పదాహతిఁ బరఁగంగ జలధు
లక్షీణగతుల నే కార్ల వంబైన
చందంబుఁ గైకొని జనపాలవరుఁడుఁ
జంద్రమతియుఁ దనుజన్ముని భయము
లందంద తేర్చుచు నాసమయమున
నెడఁ జొచ్చి వారింప నింతలోఁ గదియ్య
దడయక నాఁడే లుదగ్రతఁ గదిసి
బక ముకంఠముఁ బట్టి బలువుగఁ దెంప
బకము పక్షములచే బలువిడి మోద..............................2910
గిరులు వ్రేళ్లతో తలక్రిందు మీఁదయ్యెం
దరులతో మృగపక్ష్మి తతులు బిట్టెగ సెఁ
దెలి యా భూ దేవి ధృతి దప్పి దివికి
మొఱఁ బెట్టబోయెనో మురవెరి కనఁగ
సురలును నజుఁడు నచ్చోటికేతెంచి
యిరవుల యెడఁ జొచ్చి 'యిఁకఁ జాలు' ననుచుఁ
గృపతోడ వారిపక్షిత్వము మాన్పి
“యపగతకల్మషు లగుమిర లిట్టి
ఘోరసంగ్రామంబు క్రూరతఁ జేయఁ
గారణమేమి యీ కౌశికు వలన................................2920
నాహరిశ్చంద్రున కైనకీ డేమి

................................................................................................

టచేత, జలధులు= సముద్రములు, ఏకార్ణవం బై న = ఒక్కటే సముద్ర మైనట్టి, తనుజన్ముని = కుమారుని, అపగతకల్మషులు=పోయిన పాపముగలవారు - పాపము లేనట్టివారు, సంగ్రామంబు = యుద్ధము, పురికొన్న సంభ్రమంబున - అతిశయించి