పుట:Haindava-Swarajyamu.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆరవ ప్రకరణము.


నాగరకము.


చదువరి: అయిన నాగరకమన మీయర్థమేమో తెలుపవలసియుందురు.


సంపా: నాయర్థము కాదు. నాగరక మను పేరిట నేది ప్రబలియున్నదో దానిని నాగరకమనరాదని యెందరో ఆంగ్లేయ గ్రంథకర్తలే వ్రాసియున్నారు. ఎన్నియోగ్రంథము లావిషయమున వెలువడియున్నవి. ఆంగ్లజాతిని నాగరకదోషమునుండి యుద్ధరించుటకు సంఘములు సభలు ఏర్పడియున్నవి. గొప్ప ఆంగ్లరచకుడొకడు "నాగరకము - దాని కారణము--దానికి ప్రతీకారము" అని యొక యుధ్ధంథము ప్రకటించినాడు. అందులో నాగరకమొక రోగమని యతడు వర్ణించినాడు.


చదువరి: మనకెందుకిది సామాన్యముగా తెలియరాలేదు?


సంపా: కారణము విదితము. ఎవ్వరును తమకు వ్యతిరేకముగా తాము విమర్శించుకొన నిచ్చగింపరు. నవనాగరికమును దిగద్రావి గఱ్ఱున త్రేపువారు దాని దూషించుచు వ్రాయజాలరు. దానిని సమర్థించుటకు కావలసిన సంగతులు వ్యాఖ్యలు తమకు తెలియకయే వెతకికొనుచుందురు. వానిని నిజములని యాలో