పుట:Haindava-Swarajyamu.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
30

హైందవ స్వరాజ్యము.

పూర్వము వారు కప్పుకొనుటకు తోళ్లుపయోగించుచుండిరి. ఈటెలనే ఆయుధములుగా వాడుచుండిరి. నేడో వారు పొడుగాటి షరాయిలు ధరించి దేహము నలంకరించు కొనుటకు వివిధ వస్త్రములను తొడగుచున్నారు. ఈటెలకు బదులు ఐదు ఆరు గుండ్లుపారు రివాల్వరులను పట్టుచున్నారు. ఇదివరకు ఎక్కువగా గుడ్డలు బూట్సు మొదలైనవి వేసుకొననట్టి జాతివారు నేటిదినము యూరోపియను వస్త్రములు మున్నగునవి ధరింతురేని వారు అడవితనము నుండి నాగరకమునకు వచ్చినట్లెన్న బడుచున్నారు. పూర్వము యూరపులో ప్రజ చేతికష్టము చేసిభూములు దున్ను చుండిరి. ఇప్పుడు ఆవిరినా గేళ్లు పెట్టుకొని ఒక్కడే అనేక యక రములుదున్ని ద్రవ్యము సంపాదించి భాగ్యవంతుడగుచున్నాడు. ఇది నాగరక చిహ్నములలో నొక్కటిగా పరిగణింపబడుచున్నది. 'పూర్వము అతిస్వల్ప సంఖ్యాకులు గ్రంథరచన చేయువారు. ఆ గ్రంథములు ఉత్తమములుగా ఉండును! నేడు ఎవ్వనికి ఇష్టము వచ్చినది నాడు వ్రాసి అచ్చు వేసి ప్రజలమానసము మంటగలుపు చున్నాడు. పూర్వము మనుష్యులు బండి కుక్కిలో బడి ప్రయాణము చేతురు. ఇప్పుడు మనో వేగముతో బోవువిమానములలో నెక్కి భూమిసోకకుండ గంటకు నాలుగుసూర్లమైళ్లు పరగుచున్నారు. ఇది యంతయు నాగరకశిఖరోత్తుంగముగ ' నాలోచింపబడు చున్నది. మానవుడభివృద్ధి యైనట్లైల్ల విమాన మెక్కి అతడు