పుట:Haindava-Swarajyamu.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
278

హరిశ్చంద్రోపాఖ్యానము.

నన్ను రక్షింపుము' నావుడు దాని
సన్నుత ప్రియవాక్యసరణిచేఁ దనదు
కులసతి యవుట నిక్కువముగా నాత్మ
దెలియక చంద్రమతీ దేవి కనియె
‘భూతనాథుఁడఁగాను భువి నెల్ల జనుల
చేత మొక్కులు గొనుసిద్ధుండఁ గాను...........................2130
వెడఁగునుందుల చేత విష మె ట్లడంగుఁ
జెడునొకో చీర రాచినఁ బాముకాటు
మందుఁ బెట్టగ నేర మనఁ జేయ నేర
నెందు నిప్పురమున నీ రుద్రభూమి
గుత్తగాఁ గైకొని గురు భుజశక్తి
నొత్తి యెవ్వరినైన ను క్కడఁగించు
బలియుండు చండాలపతి వీర బాహుఁ
డెలమిమై మన్నించి యీ ముద్రగుదియఁ
దగ నిచ్చి యీ కాడు తఱలక రేయుఁ
బగలును గావంగఁ బనిచె న న్నిందు.....................2140
వీరదా సను పేర వెలయుచుండుదును
వారక నడు రేయి వచ్చి నీ విట్లు
నన్నుగానక యుండ నందనుఁ దెచ్చి
పిన్ననిఁ జతిమీఁదఁ బెట్టంగఁ దగునె
నెలఁతవు గాన మన్నించితి నిన్ను

....................................................................................................

డవో, చెడునొకో చీరరాచినఁబాము కాటు=పొముకఱచిన విషమును గుడ్డ తో రాచి తుడువఁగా తీసిపోవునా, మనఁ జేయన్ = బ్రతికించుటకు, గురుభుజ