పుట:Haindava-Swarajyamu.pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయ భాగము.

279

దల దైవ్వ వేయుదుఁ దక్కొరుఁడై న
సొద వేర్పఁ దగునంత చోటుకు మాడ
మొదటనే తెచ్చి మాముందర బెట్టి
పిదప దహింతురు పీనుఁగుఁదెచ్చి
ముదిత యీతగిన చొప్పున నీవు దెచ్చి...........................2150
యీకుమారున కగ్గి నిమ్మిటుపొసఁగ
లేకున్నఁ గాల్చి పోలేవు న న్నేలు
నొడయుఁడు వీర బాహునియఢులాన
వెడలి పో' మనిన న వ్వెలఁది యిట్లనియెఁ ? "
'బరహిత చరిత నాపై నొక కొంత
కరుణ సేయక సిరి గలదానివ లెనె
యడిగెద వేల న న్నదలించి యిపుడు
యెడపక దీన నీ కేమి గూడెడిని
సక లదీవుల నేలుజనపతిపుత్రుఁ
డకట చే రెండు నేల కర్హుండు గాఁడె ................................2160
నీ వేమి సేతు పన్నినమునిమాయ
నా వెంటఁ దతిగొని నలఁచి పో నీక
పట్టి యీగతి నేలపైనిడి కాల
బెట్టి ప్రాముచు బుస వెట్టు చుండంగ'

....................................................................................................

శక్తి న్ = గొప్ప బాహు బలము చేత, కాఁడు=శ్మశానము, తక్కొరుఁడు=మరి యొక్కఁడు, సిరి గలదానిపలెనే - సంపదలగల స్త్రీవలెనే, నీ కేమిగూ డెడిని= నీకేమలాభము ఒనఁగూడఁగలదు, జనపతి పుత్రుఁడు= రాజకుమా రుఁడు, తతిగొని= విడువక , నేల పైనిడి 'కాలఁ బెట్టి ప్రాముచున్ = నెల పైఁ బెట్టి కాలి తో రాచుచు, చాయ గాన్ = చూచాయగా - జాడగా తన సంగతి సూచిత