పుట:Haindava-Swarajyamu.pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
256

హరిశ్చంద్రోపాఖ్యానము-

కిటు నిన్నుఁ బని కంప నెట్లు నోరాడె
నడవికి నీ విప్పు డరిగినఁ గాని
తడయక విప్రునితల యేరు దిగదు...........................1730
పట్టభద్రునికూర్మి పట్టికి వేల్మి
కట్టెలు మోవంగఁ గట్టడే నీకు
గట్టిగా భాగ్యంబు గలవధూ మణికి
బుట్టక నా కేల పుట్టితి కూన
యడవికి నిన్నుఁ బొమ్మనఁ జూచి చూచి
నుడువంగ నే గతి నో రాడు నాకు
నీనుఁ బాసి నిమిషంబు నే నిల్వఁ జాల
ననుఁ బాసి పోయె దే నా ముద్దులయ్య
చేకొని యిఁక నేమి సేయ నున్నవియొ
కాక విశ్వామిత్రు కపటవ ర్తనము'...........................1740
లని వెచ్చ నూర్చుచు నా పుణ్యసాధ్వి
వినయంబుతో నెల్ల వేల్పుల వేడి
దనుజదర్వీకరతస్కరభూత
ఘనతరమృగ పక్షి గణములవలన
నవిరళంబుగఁ బ్రాణహాని లేకుండ
వివిధ భంగులను దీవించి నందనుని
వల చేత నొకరకు నలనొప్పం గట్టి

.................................................................................................................


తలనొప్పి, పట్టభద్రుని .... పట్టిన్ = పట్టాభిషి, క్తుఁడైన రాజుకడుపున బుట్టిన గా రాబు కొడుకునకు, వేలి క ట్టెలు= హోమముకొఱ కై నసమిధలు, కట్టడే = నిర్ణయ మా, విశ్వామిత్రుక పటవ ర్తనములు చేకొని యిఁక నేమి సేయనున్నవియె కాక అనియన్వయము, దనుజ = రాక్షసులు, దర్వీకర = సర్పములు,తస్కరం దొంగలు, అవిరళంబుగన్ = దట్టము గా , వలను ఒప్పన్ = పొందుబాఱఁగా, మోరత్రోపు