పుట:Haindava-Swarajyamu.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
190

హరిశ్చంద్రోపాఖ్యానము

కా దేని వరువుడు గా దార మోసి
మోదంబుతోడ నీ ముదిత మా సఁగు
మెనయంగ నీతప్పు లేము వహించి
కొని కాచెదము బ్రహకొడుకు వచ్చి నను'..................570
నని పెక్కు దుర్భాష లాడెడువిపు
గనుఁగొని విభుఁ డాత్మ..గలఁగ కిట్లనియె
'నరసి చూడఁగ నేర వకట దురాత,
పరిణామములు బహుభాష లే కాని
జగతిపై సూర్య వంశమునఁ ద్రిశంకు
జగతీశునకుఁ బ్రశస్తంబుగాఁ బుట్టి
యేరాజ్య మొనరించునీ కాలమునకుఁ
జోరశబ్దము సెవి సోఁకె నీ చేత
మఱి బ్రాహ్మణుఁడు వచ్చి మఱుగుఁ జొచ్చినను
దజలక రక్షింపఁ దగుఁ గాక మాకుఁ.........................580

........................................................................................................

సికొని రేని, వరవుడుకా : దాసి, దారపోసి దానము చేసి, ముదిత =స్త్రీ,ఆ త్మన్ =మనస్సునందు, పరిణామములు= బింకములు. ఏ... కాలమునకు = నేను రా జ్యము సేయుచుండిన యింత కాలమునకు, చోరశబ్దము ... నీ చేతన్ = నీవు చెప్పఁగా చోరుఁడనుపలుకు నా చెవులఁబ డెను. పట్టిశబ్దమే పడెననుట చే నిజముగా చో రుడు కలుగ నే కలుగఁడయ్యెననియు, ఆశబ్దము ఇంత కాలమున కిప్పుడె వినిఁబ డెను. ఇంతకుఁ బూర్వము శబ్దమునుగూడ విన్నది లేదనియు హరిశ్చంద్రుని ధ ర్మోత్తరపరిపాలన మహిమాతిశయము దెలియునది. 'నారాజ్యమందు చోరశబ్ద మే వినఁబడకుండఁగా రాజగు నేనా చోరుఁడనగుదునని కాలకౌశికుని నే -పొడుచుట యూహ్యము. కాలకౌశికుఁడు చంద్రమతిని దొంగలించి తెచ్చితివా యన్నందుల కిదియు తరము.ఇఁక కోమలిని మాకు దానము చేసితి వేని నీతప్పులను మేమారోపించుకొని నీక పాయము లేకుండఁ జే సెదమన్న కాలకౌశికుని వాక్య మున కుత్తరమిచ్చుచున్నాఁడు 'మరి... బాఱఁదగునే బ్రాహ్మణుఁడు భ