పుట:Haindava-Swarajyamu.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

134

హైందవ స్వరాజ్యము.

కాని మీ నడవడిచే మామానసమునకు వైక్లబ్యము కలుగ లే దని మాత్ర మనుకొనబోకుడు. స్వార్థముమై కాని భయముమై కాని మా యభిప్రాయముల వెలిబెట్టు చుండలేదు. ఇప్పుడు నిర్భయముగా తెలియపరచుట మా ధర్మము కావున తెలుపుచున్నాము. మా ప్రాచీనవిద్యాలయములు న్యాయ స్థానములు పునర్జీవితములు కావలెను. భారతభూమికి సామాన్యభాష హిందీ కాని ఇంగ్లీషు కాదు. మీర లందువలన దానిని నేర్చుకొనవలెను. మీతో మేము మా జాతీయభాషలోనే ఉత్తర ప్రత్యుత్తరములు జరుపగలము.

రైళ్లకు, సైన్యాలకు మీరు కర్చు పెట్టుచుండుట మా కసమ్మతము. రెంటికి అవసరము మాకు కానరాదు. రుష్యా వలన మీకు భయ ముండవచ్చును. మాకు లేదు. ఆజాతి పైబడివచ్చిన మేము చూచికొందుము. మీరు మాతో నప్పటికి నుందు రేని ఇరువురమును కలసి చూచుకొందము. యూరోపియను వస్త్రములు మా కక్కరలేదు. మా దేశమున సిద్ధ మయినవస్తువులతో, ఉత్పత్తులతో, సంతుష్టి నందుదుము. మీ రొకకన్ను మాంచెస్టరుమీద ఒక్క కన్ను భారతభూమిమీద పెట్టి యుంచకుడు. మన లాభాలాభము లేకము చేసికొనిననే మన మేకముగా నుండి పనిచేయవచ్చును.

దీనిని మేము మీకు చెప్పుట దంభపరత్వమున గాదు. మీకు గొప్ప సైనికబలము కలదు. మీ నావికబల మసా