పుట:Haindava-Swarajyamu.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉపసంహారము.

135

మాన్యము. మీతో సరిసమానముగా మీ మార్గమున పోట్లాడ నెంచుదుమేని మీకు నిలువజాలము. పై మేము తెలిపినకోరికలు మీకు సరిపడవేని మేము పాలితులుగా నుండము. మీ కిష్టమేని మమ్మును తునుకలక్రింద తరిగివేయుదురు గాక. ఫిరంగుల యెదుటనిడి తుత్తునియలుగా భేదింతురు గాక. మా సంకల్పమునకు వ్యతిరేకముగా మీరు ప్రవర్తించు నెడల మీకు మేము సహాయముచేయము. మా సహాయము లేక మీ రొకయడుగైనను పెట్టలే రనుటయు మే మెరుంగుదుము. గుదుము.

మీకు అధికారము కలదు. దానిమత్తుచే మీరు మమ్ము నవ్వుదురుకాబోలు. వెంటనే మీ మోహమును మేము పాపలేము. కాని మాయందు పౌరుషము కొరవడదేని అచిరకాలముననే మీ రెంతటి ఆత్మవినాశకమార్గము నవలంబించినచియు బుద్ధిపటిమలోపమున మము నవ్వినదియు మీకె యెరుకపడగలదు. మీరు ఆధ్యాత్మికజాతికి చెందినవా రని మా హృదయపూర్వకవిశ్వాసము. మా వసించుభూమి ఆధ్యాత్మిక సత్యములకు పుట్టిన యిల్లు. మన మెట్లు ఒక్కరికొక్కరు తటస్థించినదియు విమర్శింప నక్కర లేదు. కాని మన పరస్పర సంబంధములు పరస్పరలాభమునకు వినియోగించు కొనుట మాత్రము సాధ్యము.