పుట:Haindava-Swarajyamu.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

128

హైందవ స్వరాజ్యము.

నది అంద రనుకరింతురు. విత్తు వృక్షమై మఱ్ఱివలె వ్యాపించును. నాయకులు చేయునది ప్రజ తప్పక యనుకరింతురు. కష్టము కాదు. చిక్కు ను లేదు. ఇతరులు మనతోడంగూడ నడచువరకును నేను మీరు నిలువ నక్కరలేదు. పనిబూనని వారే నష్టులు. తెలిసియు ప్రారంభింపనివారు పిరికివారు.

చదువరి: ట్రాంబండ్లను గురించియు విద్యుచ్ఛక్తిని గురించియు మీ రేమందరు ?

సంపా: ఈ ప్రశ్న యప్రస్తుతము. దీని కర్థమే లేదు. రైళ్లే అక్కరలే దన్నప్పుడు ట్రాంబండ్లును అక్కర లేదే. యంత్రములు పాములపుట్టలు. అందులో నొకపా ముండవచ్చును. నూరుపాము లుండవచ్చును. యంత్రములవృద్ధి యున్న చోట నగరములవృద్ధియుం గలదు. నగరములుకలచోట ట్రాంబండ్లు, రైళ్లు తప్పవు. విద్యుచ్ఛక్తియు నటనే తాండవమాడును. ఇంగ్లీషు గ్రామముల కీదంభములు ప్రాక లేదు. యంత్రా ధారమగు రాకపోకలు ప్రబలినచోట ప్రజల ఆరోగ్యము చెడిపోయిన దని ధర్మమెరుంగు వైద్యులు చెప్పుదురు. యూరోపు నగరములలో నొక్కట నొకప్పుడు ద్రవ్యము లేకపోయెను. ట్రాములకు వకీళ్లకు, వైద్యులకు ఆదాయము తగ్గిపోయెను. ప్రజలకు ఆరోగ్యము అలవడెను. ఇది నేనెరిగిన సంగతి. యంత్రములవలన ఒక్క మేలు కలదని నాకు దోచదు. వానివలన నష్టములను గురించి గ్రంథములు వ్రాయవచ్చును.