పుట:Haindava-Swarajyamu.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యంత్రసామగ్రి

127

త్రాగారాధీశు లిదిచేసినను చేయకున్నను ప్రజ యంత్రాగారములలో చేసిన నస్త్రములను ధరించుట మానివేయవచ్చును.

చదువరి: ఇంతకాలమును మీరు యంత్రవినిర్మితవస్త్రములసంగతియే చెప్పుచువచ్చితిరి. ఇంక నెన్ని యోవస్తువులు యంత్రనిర్మితము లున్నవి. వానిని దిగుమతియైన జేయవలెను. లేదా వానికై మనదేశమున యంత్రముల నైనను స్థాపించవలెను.

సంపా: నిజము. మన దేవతలనుగూడ - విగ్రహములను కూడ నని యర్థము. జర్మనీవారు చేయుచున్నారు. నిప్పుపుల్లలు, గాజు, గుండుసూదులు ఇత్యాదులమాట చెప్ప నేల ? నాయుత్తరము మీ కిది. ఈ వస్తువులు రాకముందు భారత భూమి ఏమి చేసినది ? అదియే నేడును చేయవలెను. యంత్ర సహాయము లేక గుండుసూదులు చేయ లేనంతకాలము మనము వానిని ఉపయోగింపవలదు. గాజు జాజ్వల్యమానము మన కక్కర లేదు. ఎప్పటివలె ప్రమిదలుచేసి వత్తిచేసి దీపము ముట్టించుచుందుము. అట్లు చేసినచో కండ్లకు రక్ష, కర్చు తక్కువ. స్వదేశిసంరక్షితము. స్వరాజ్యము చేరువ .

అందరు ఇన్ని ఒకేపర్యాయము చేయుదు రనికాని కొందరైనను అన్ని యంత్రనిర్మితనస్తువుల వదలుదు రనిగాని నా యర్థము కాదు. భావము సరియైన దయినయెడల ఏదియేది వదలవచ్చునో కనిపెట్టి వదలుచు పోదురు. కొందరు చేయు