పుట:Gutta.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వ్యవసాయము చేయకుండా మిగత పనులు చేయు అన్ని కులముల వారికి అమ్మవలె ఆదరించి అన్నము పెట్టు సమాజమునకు అమ్మకులము అని ఆనాడు పేరువచ్చినది. ఆనాడు ఎవరిమీద ఎటువంటి దౌర్జన్యము చేయకుండ, ఇతరులపట్ల అన్యాయముగా ప్రవర్తించకుండా, లేని వారినందరిని ప్రేమతో పలకరించి, ఆకలికి అన్నము పెట్టు సమాజము అమ్మసమాజముగా, అదియే అమ్మకులముగా మారిపోయినది. ఆ కాలములో తమ భూమిలో కాయకూరలతో సహా అన్ని పంటలు పండించుచూ బ్రాహ్మణుల తర్వాత అమ్మకులమువారు రుచిగా తినెడివారు. వారు రుచిగా తినడమేకాక, ఇతరులకు కూడా రుచిగానే పెట్టెడివారు. ఆహారమును కమ్మగా తినడమే కాక ఇతరులకు కూడా కమ్మగా పెట్టడము వలన కాలక్రమమున అమ్మకులము, కమ్మ కులముగా రూపాంతరము చెందినది.


ప్రబోధానంద యోగీశ్వరులకు యుక్తవయస్సు వచ్చినప్పుటినుండి ప్రతి దినము కొంతమందికైనా భోజనము పెట్టు అలవాటున్నది. అప్పటి నుండి ఇప్పటివరకు పూర్వము అమ్మకులము అనుసరించిన విధానము ప్రకారము అనుసరించడము ఆయన స్వభావములో ఉండుట వలన ఆయనను కమ్మకులముననే పుట్టించడమూ జరిగినది. నేటి కమ్మ కులస్థులు కొందరు తమ పూర్వపు విధానమును మరచిపోయి ఇతరులకు అన్నము పెట్టు పద్ధతిని వదలివేశారు. అందువలన దైవిక అర్థమునిచ్చు గుత్తా వంశమున, ప్రపంచములోని విధానమును తెల్పు కమ్మ (అమ్మ) కులమునే ప్రబోధానంద యోగీశ్వరులు పుట్టడము జరిగినది. ప్రపంచములో ప్రకృతి సంబంధమైన అమ్మ విధానమును అనగా మాయ విధానమును ఒక ప్రక్క చూపువాడుగా కమ్మకులమున, అలాగే ఆధ్యాత్మికములో దైవికమైన మూడు

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Gutta.pdf/36&oldid=279918" నుండి వెలికితీశారు