పుట:Gutta.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మలను గుర్తుచేయు వాడుగా గుత్తావంశమున ప్రబోధానంద యోగీశ్వరులు పుట్టడము జరిగినది.


పరమాత్మ అంశతో కూడుకొన్న ఆత్మగల మనిషి భూమిమీద అరుదుగా పుట్టుచుండును. అలాంటి జన్మ భూమిమీద జరిగినపుడు ఆ మనిషి అందరికీ సర్వసాధారణ మనిషిగా కనిపించినా, కొందరు జ్ఞానులు మాత్రము అటువంటి జన్మయొక్క ప్రత్యేకతలను గుర్తించగలరు. పరమాత్మ అంశగలదనుటకు ఏమి నిరూపణ అను ప్రశ్నకు ఇంతవరకు పుట్టిన సంవత్సరము, పుట్టిన వంశము, కులమును గురించి చెప్పుకొన్నాము. ఇప్పుడు ఆయన పుట్టిన స్థలమును గురించి చెప్పుకొందాము. పరమాత్మ అంశ అంతములేనిది, అనంతమైనది. అటువంటి అనంతమైన దైవాంశ ‘‘అనంత’’ అను పేరుగల ఊరిలోనే పుట్టవలెనని దైవనిర్ణయము ఉండడము వలన అనంతపురము అను పేరుగల ఊరిలోనే ప్రబోధానంద పుట్టడము జరిగినది. అనంతపురములో నివసించువారిలో అజ్ఞానముండినా, అక్కడ వారిలో జ్ఞానము లేకపోయినా ఊరి పేరులో మాత్రము దైవధర్మము కలదు. దైవము అనంతుడు, కావున అనంతపురము అను పేరులో పరమాత్మ అంశ పుట్టడము జరుగవలసిందే. కావున జరిగిందని చెప్పవచ్చును.


ప్రబోధానంద యోగీశ్వరులు అనంతలో పుట్టినపుడు, పరమాత్మ అంశకు తగినపేరే నిర్ణయించబడినది. ప్రపంచములో అతి రహస్యమైనవాడు దేవుడు. అలాగే అన్నిటికంటే పెద్దవాడు దేవుడే. దేవున్ని మించిన వాడుగానీ, దేవునికి సమానమైన వాడుగానీ భూమిమీద ఎవరూ లేరు. అందువలన అందరికంటే ఆయనే (దేవుడే) పెద్ద. పెద్ద అను పదమును బ్రహ్మ అని కూడా అనవచ్చును. బ్రహ్మ అంటే పెద్ద అని అర్థము, కావున దేవున్ని బ్రహ్మ అనికూడా అనుచున్నాము. దేవుని అంశతో కూడుకొన్న ఆత్మ

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Gutta.pdf/37&oldid=279919" నుండి వెలికితీశారు