పుట:Gurujadalu.pdf/659

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఇతర యుద్ధమల్లులు చాళుక్య రాజులందు గల యుద్ధ (ఆహవ) మల్లులలో రాజనరేంద్రునకు తరువాత వారు కూడగలరు అని శ్రీ బ్రహ్మయ్య శాస్త్రులు వారు వ్రాసిరి. పర్యాయ పదములను పెట్టి పేర్లు మార్చడము కారణాంతరములు లేనిదీ యుక్తము కాదనుకుంటాను. బెజవాడ శాసనపు యుద్ధమల్లుడు కాక యితర చాళుక్య యుద్ధమల్లులు కావలసినచో కలరు. Fleets Canarese Dynasties 211, 212. పుటలను, 380, 381 పుటలను రైస్ దొరగారి కర్ణాటక భాషా భూష ణము ఉపోద్ఘాతము. 13, 14 పుటలను చూచునది. కన్నడ భాషలోని పంప భారతము అరికేసరి అనెడి చాళుక్య రాజుకోరికను వ్రాయబడినది. ఈ రాజు యొక్క పూర్వులలో యుద్ధమల్లుడనే ఆయన వేంగి దేశము నుండి కన్నడ దేశమునకు వచ్చి ధార్వాడ జిల్లా ప్రాంతమందు ఒక సంస్థానమును స్థాపించెను. ఆ యుద్ధ మల్లుడి తరువాత అయిదో పురుషుడు మరియొక యుద్ధమల్లుడు. అరికేసరి యితని మనవడే. పంప భారతము శాలివాహన శకము 863వ సంవత్సరములో వ్రాయబడెను. గనుక ఈ యుద్ధమల్లులు రాజు రాజునకు ప్రాచీనులే. రాజరాజునకు తరువాత కూడా చాళుక్య యుద్ధ మల్లులు వుండి వుండలేదని యెవరు చెప్పగలరు? దేశ చరిత్రయు పూర్తిగా నున్నచో యిట్టివారుండి యుండలేదు అని చెప్పుటకు అవకాశము వుండును. మన పూర్వులు చరిత్ర ముఖమే యెరుగరే! ఒక్క పేరును బట్టి యితడు యితనని నిర్ణయించరాదు. బెజవాడ శాసనపు భాషకును నన్నయభట్టు భాషకును వ్యత్యాసము కూడా వున్నది. అందు గూర్చి ముందు చర్చించెద. గురుజాడలు 614 యితర యుద్ధమల్లులు