పుట:Gurujadalu.pdf/657

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యుద్ధమల్ల నృప వంశాంభోధిర శ్న స్యతస్యాపో... సహా గతమహమమాత్యశ్చ సేనాపతి. యాశ్చాసౌ గుడియూరిపూ ర్శకబహు గ్రామాధినాథః. “స్వస్తిశక వర్షంబులు 1100 అగు నేటి వుత్తరాయణ నిమిత్తంబున గుడియూరి వెన్నపరెడ్డి కొడుకు దండనాయక మల్లిరెడ్డి దన్నేలిన శ్రీ మన్మహామండలేశ్వర వేంగి గొంక రాజునకు ధర్మముగా మాద్యపల్లి శకటేశ్వర మహాదేవర గుడియును మంటపము గోపుర ప్రాకారపరివార సహితముగా దను యెత్తించి దేవరకు సాలునకు మానులకు నిబంధన నైవేద్యములకు....” ఇరియటు దొరవారి శాసనములలోనే మరివక శాసనము కలదు. అది యిట్లున్నది. “బందరు జిల్లాలోని గణపవరం గ్రామములో గ్రామానకు తూర్పున సువర్ణ గుండం దక్షిణపు వైపున వేంచేసియున్న శ్రీ సువర్ణేశ్వర స్వాముల వారి దేవాలయం ముఖ మంటపంలో వాయువ్య మూల స్తంభం పడమర వైపు పలక మీద శాసనము. “స్వస్తి సమధీగత పంచమహాశబ్ద మహా మండలేశ్వర... పురనరాధీశ్వర, మానవ్యసగోత్ర హరీతిపుత్ర సోమవంశార్ణవ చంద్ర, సత్య హరిశ్చంద్ర, దళితరిపుదర రాజకందర్ప. యుద్ధమల్లవంశ సముద్ధరణ, భయలోభ... హర్న షట్సహస్రావనీనాయక, వయిరి భయదాయక శ్రీ మల్లేశ్వర మహాదేవ దివ్యశ్రీ పాదపద్మారాధక పరబలసాధక నామాది సమస్త ప్రశస్తిసహితము శ్రీమన్ మహామండలేశ్వర వేంగిమల్లి దేవరాజు కొడుకు గోకరాజులు శకవర్షంబులు 1066 అగునేటి ఆషాఢకృష్ణ ఏకాదశియు బుధవారము నాడు దక్షిణాయన ...తినిమిత్తంన శ్రీమతు పద్మినీపురమున శ్రీ సర్వేశ్వర మహా దేవరకు నఖండవర్తి దీపమునకు నిచ్చిన సురభలు 30. దీనింజేకొని తోకల కొండబోయిండు పుత్రానుపౌత్రికముగా సాగనీయంబెట్టి నిత్యం మానెడు నెయ్యి నడుపంగల వాడు. శ్రీ వేంగి సాకాచారి లిఖిత. పై శాసనములలో గణపవరం శాసనము సూయల్ దొరగారి జాబితాలలో ఒకటవ సంపుట 39వ పేజీలో ఉదహరింపబడియున్నది. శకము 1096గా నీబడినది. ఇరియటు దొర వారివి సూయల్ దొరగారివి సరి అయిన ప్రతులు కాకపోవడం చేత లేఖకులు ఒక అంకెనే 6 గాను 9 గానూ చదివి యుందురు. ఇట్టి శాసనములున్నవని తెలుపుటకంటె వీటి ప్రయోజనము వుండబోదు. చాళుక్య యుద్ధమల్లుని సంతతివారు కృష్ణాజిల్లాలో సామంత ప్రభువులుగా వుండిరనుటకు ఈ నిదర్శనములు చాలు ననుకుంటాను. ఇతర స్తలములలో కూడా ఈ వంశము వారి శాసనములు కలవు. బెజవాడలోనే వేంగి గొంకరాజు కొమారుడున్ను మల్లపరాజు మనమడున్ను అయిన మహాదేవరాజు శాసనములు ఆంధ్ర కవితాపిత గురుజాడలు 612