పుట:Gurujadalu.pdf/656

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంధ్ర కవితాపిత అని బెజవాడ శాసనములో యుద్ధమల్లుని గూర్చి “రాజ్య పట్టంబుగట్టినపతి వ్రాసియున్నది. “బాడబు మహారాజాధి రాజు”ని గుంటూరు శాసనమున నున్నది. యుద్ధమల్లుడును అతని సంతతి వారును తామే పూర్వ చాళుక్య రాజ్యమునకు హక్కుదార్లమను వాదమున నిలిచియుందురు. “రాజసల్కిభూవల్లభుండ”ను చోట “సల్కి” అనుమాట “చాళుక్య" అనుమాటకు దేశ్యము. ప్రాచీనమగు శివానందయోగేశ్వరుని మరాఠీ వంశావళియును గ్రంథములో “చాళ్కే” అనుపేరు “చలకియా” “సాళంగే” రూపములు కూడ నీయబడినది. కవిరాజ మార్గము ఉపోద్ఘాతం 8వ పుట చూడుడు. చాళుక్య అనుమాటకు గల రూపములను గురించి Fleet, dynasties of the Canareses districts in Bombay gazette volume 1. Part Il' pages 336, 337 లోచూడుడు. “చాళుక్యర్” అను రూపము కుబ్జవిష్ణువర్ధనుని సతారా శాసనములో నున్నది. Indian antiquary vol. XXI. P.303) మరియు ఓఘాగారి పుస్తకము 1 పేజీలో నోటు చూడుడు. ఇరియటు దొరగారు సంపాదించిన శాసనముల వల్ల వేంగిగొంక రాజనునతడు యుద్ధమల్లుని వంశము వాడయినట్టు కానవచ్చుచున్నది. నా ప్రతి శుద్ధమైనది కాదు. శాసనపు రాతీలో కొంత ముక్క కూడా విరిగిపోయినట్లు తెలియుచున్నది. అసలు శాసనమును చూడడము ఆవశ్యకము, ఇరియటు దొరగారి ప్రతిలోని పంక్తులు కొన్ని ఈ క్రింద ఉదహరించెదను. “సదరు జిల్లా రావిమట్ల గ్రామంలో వూరికి పడమర వయిపున తాడిమళ్ళ ప్రకాశనాయుడు గారి లోగిలి ప్రహరీ గోడకు ఉత్తర భాగమున పడివున్న నల్ల రాతి మీదీ లివి. పయి పలకవాత యీ రాయిపయివరస కొంత విరిగిపోయినది. అందుచేత రాత కూడా కొంత పోయినది. “పుత్రస్తస్య త్రిణేత్రప్రభు... రాజేశ్యన్వర్థ సంజ్ఞ : కుముద వనహిత శ్రీ.... వతంస.... వేంగి గొంకేశనామా... గురుజాడలు ఆంధ్ర కవితాపిత 611