పుట:Gurujadalu.pdf/571

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పరీక్షించుచున్న రాముఁడు వీధీ నడుమ కానవచ్చెను. పట్టరాని కోపముతో వానిని ఁజూచి గోపాలరావు “రామా! రా!” యని పిలచేను. రాముడు గతక్కుమనీ చుట్ట పారవైచి, “బాబు” అని డగ్గరెను.

“మీ అమ్మేదిరా?”

“మా యమ్మా! యింటున్నది బాబూ”.

“మీ అమ్మ కాదురా; బుద్ధిహీనుఁడా, నా భార్యా"

“అమ్మగారా? యెక్కడుంటారు బాబూ? పడుకున్నారు”

“యింట్లోనే లేదు”. .

రాముడి గుండెలో దిగులు ప్రవేశించెను. గుమ్మములో అడుగు పెట్టగానే రాముని వీపుపై వీశ గుద్దులు రెండు పడెను. “చంపేస్తిరి బాబూ” అని రాముఁడు నేల కూలఁబడెను.

గోపాలుఁడు సదయ హృదయుఁడు. అక్రమమాచరించితినను జ్ఞానము వెంటనే పొడమి ఆగ్రహావేశము దిగజారి పశ్చాత్తాపము కలిగెను. రాముని చేత లేవనెత్తి, వీపు నిమిరి పశువువలే నాచరించితినని యనుకొనుచు గదిలోనికి తీసుకొని పోయేను.

కుర్చీ పయి కూచుని “రామా యేమాయెరా?” యని దైన్యముతో ననేను.

“యేటో మాయలా వుంది బాబూ”

“పుట్టింటికి వెళ్లియుండునా?”

“అంత వారు కారనా? బాబూ కోపగించితే చెప్పలేను గాని ఆడారు. చదువు నేరిస్తే యేటౌతదీ?”

“విద్య విలవ నీకేం తెలుసురా, రామా!” అని గోపాలరావు మోచేతులు బల్లపయినాని వానీ నడుమ తలయుంచీ యోచించుచుండ కమలినీ చేవ్రాత నొక యుత్తరము కానవచ్చేను. దానిని చదువసాగెను.

“అయ్యా !”

'ప్రియ', పోయి "అయ్యా!' కాడికి వచ్చేనా?”

“పెయ్య పోయిందా బాబూ”

“మూర్ఖుడా! వూరుకో!”

"అయ్యా! పదీ దీనములాయే. రాత్రులనింటికి మీ రాకయే నే నెరుగను. మీటింగులకు బోవుచుంటి మంటిరి. లోకోపకారకరములగు నుద్యమముల నిదుర మాని చేయుచుంటిమంటిరి.

గురుజాడలు

526

దిద్దుబాటు