పుట:Gurujadalu.pdf/471

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

 నారా : ఆ పీనుగులకంటే యెవడైనా నయవేఁ అని నా అభిప్రాయం.

కేశ : నేను చెప్పవచ్చిన మాటా అదే. బిల్హణుడు మహాకవీ, ప్రతిభావంతుడున్నూ. అప్పుడే | రామశాస్తుల్లుకీ కృష్ణస్వామికీ కొన మళ్లించాడు. అది మనకో గొప్ప లాభం కాదా?

నారా : ఔను గాని, మన కొన కూడా మళ్లించే ప్రయత్నం చేస్తున్నాడే!

కేశ : మనకు కొనంటూ వొకటి వుంటే కదూ మళ్లించడానికి? మీ, నా, అదృష్ఠాలు నాడే గిడస బారాయి. రాజు మన శాస్త్రాలు అక్కర చెయ్యడమే మానెను. మనం సభకు రాకపోయినా యేమైనారని తనుపే లేదు. మన పదవీ సదక్షిణాకంగా ధారపోస్తే వొల్లడు బిల్హణుడు.

నారా : అవును, మన అవస్థ అలాగే వుంది.

కేశ : ఈపాటి భాగ్యానికి అతగాడితో వృథావాదం మన కెందుకూ? కలహం పెంచకండి. నిన్న మీరు ఉభయులూ వాదీస్తూ వున్న సమయంలో రాజు ఉదయమంత్రితో రాచకార్యాలు ప్రశంసించుచుండెను. కనిపెట్టితీరా?

నారా : ఆలాగనండీ! అయితే నావాదవఁంతా వృథాయే? అవును. రాజు మెచ్చుతాడన్న ఆశ చాలా కాలామాయి వొదులుకున్నాను, గానీ, జినచంద్రుడయినా మెచ్చుకున్నాడా?

కేశ : స్తంభాన్ని జారబడి నిద్రపోయినాడు.

నారా : ఆసి! వీడి బొడ్డు పొక్కా పాండిత్యం కురిపిస్తూంటే యలా నిద్రపోయినాడయ్యా?

కేశ : ఇక్కడికి సంతుష్ఠి అయిందా?

నారా : అయితే ముందు యేంజేదాం!

కేశ : ఇటుపైని వాదం మానీసి, బిల్హణుడు ఏమన్నా మెచ్చుకుందాం.

నారా : ఓడిపోయినావఁనుకుంటాడేమో?

కేశ : బిల్హణుడి యోగ్యత మీ రెరగరు. ఎదటివాడి సత్తువ యెన్నే ఔదార్యం, పండితుల్లోకల్లా అతనియందే కలదు. నిజమైన విద్వత్తుకు జోహారు చేస్తాడు. అతను వైరులకు పిడుగు, స్నేహితులకు చందనము.

నారా : అయితే నా పాండిత్యం విషయమై అతగాడి అభిప్రాయం యెట్టిదో కనుక్కున్నారా?

కేశ : దిగ్దంతులం, మన పాండిత్యం విషయమై ప్రాజ్ఞుడైన వాడికి మరో అభిప్రాయం యేలా | కలుగుతుంది? ఆయన మనసులో మాట దాచే వ్యక్తి కాదు. రేపో నేడో ఆయన ముఖతఃమీరే వింటారు. అదుగో మాధవశర్మ వస్తున్నాడు మొహం మంగలంలా వుంది.

(యామినీదేవికి విద్యాగురువు మాధవశర్మ ప్రవేశించును. )

గురుజాడలు

426

బిల్హణీయము