పుట:Gurujadalu.pdf/472

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాధవ: రాజుకు మతిపోయింది.

నారా : యేవఁండోయి?

మాధవ: యామినీదేవికి బిల్హణుడిచేత, విద్య చెప్పిస్తాడష!

నారా : మరి మీరో?

మాధ : కొత్త నీరొచ్చి పాతనీరు కొట్టుకుపోయింది.

నారా : యేం విద్య చెప్పిస్తారో?

మాధ : యేం వీద్యో నాకేం కావాలి! క్రూణతలో క్లూణత, అతగాడు చదువు చెబుతూవుంటే నేను కూడా వింటూ దగ్గర కూచోవాలష! “విపులాచ పృథ్వీ” అన్నాడు, మరో రాజు కాళ్ళు పట్టుకుంఛాను.

కేశ : బావా! తొందరపడకు. నీ జీతం నిలుపు కాలేదు గద?

మాధ : లేదు గానీ పువ్వులమ్మిన వూళ్ళో కట్టెలమ్మవలశి వచ్చింది గద?

కేశ : రాజుల యిష్ఠాయిష్ఠాలు మనమా శాసించే వాళ్ళము? పండితుడన్న వాడికి, కాలు కాలిన పిల్లిలాగ దేశాలు తిరిగి కష్ఠజీవనం కల్పించుకోవడానికి బదులుగా, గొప్ప ఆస్థానమందు ఉపాధి కలగడం పెద్ద అదృష్టం కాదా? అది తన్నుకుపోవడం ఉచితంకాదు. మన రాజు రాజర్షి యిట్టి రాజు యెన్ని రాజ్యాలు తిరిగినా మీకు దొరకడు.

మాధ : రాజర్షయితే యీలాటి ఘోరం ఆచరిస్తాడండీ ?

కేశ : ఘోరానికీ, అఘోరానికీ మీరయినా యామినీదేవికి కలకాలం విద్య చెప్పేది లేదు గద? రేపో నేడో ఆమెకు వివాహవైఁ విద్య కట్టడుతుంది. యీలోగా బిల్హణుడు నొల్లుకుపోయీది యేమీ లేదు.

మాధ : యెవడిదాకా వొస్తే గానీ వాడికి తెలియదు.

కేశ : యెవడైనా కాకతీరనీ పనికి తలవంచక తీరదు. రాజుకు యెవడు మాన్యుడైతే మనకు వాడే రాజు గనక బిల్హణుణ్ణి మంచి చేసుకోవడమే నీతి.

మాధ : మానభంగానికి కారణభూతుడైన శత్రువును బతిమాలు కొమ్మన్నావు. మంచీ నీతే!

“రథకారో నిజాం భార్యాం

సజారాం శిరసా కరోత్" అన్న న్యాయంగా వుందీ నీ సలహా!

కేశ : మనిషి దైవసృష్టి, శత్రుమిత్రులు మనుష్యసృష్టి. “అయం బంధుః పరోవేతి గణనా లఘుచేతసామ్! పుంసా ముదార చిత్తానాం వసుధైవ కుటుంబకమ్”

గురుజాడలు

427

బిల్హణీయము