పుట:Gurujadalu.pdf/452

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గిరీశ : యెంచేత ఆళ్లేడండి. సౌజ : వాదికి బాధించే నిజం వాది తరపు వకీలికి అక్కర్లేదు. ప్రతివాదిని బాధించే నిజం ప్రతివాది వకీలుకి అక్కర్లేదు. క్రాసెగ్జామినేషను ఆరంభం అయేసరికి యెంతటి సాక్షీ కవిత్వం ఆరంభిస్తాడు. అంచేతనే పెద్ద మనుషులు బోనెక్కడానికి భయపడతారు. గిరీశ : వకీళ్లు అబద్ధాలాడిస్తే న్యాయం కనుక్కోడానికి జీతం పుచ్చుకునే జడ్జి యేం జేస్తాడండి? సౌజ : ఉభయ పార్టీల వకీళ్లు ఆడించే అబద్ధాలూ చెయ్ఫికేటట్టు రాసుకుంటాడు. గిరీశ : అయితే యెందుకండి యా కోర్టు. సౌజ : నేను అదే చాలా కాలవాఁయి ఆలోచిస్తూ వుంటిని. పెద్ద పెద్ద వకీళ్లుకూడా సిగ్గుమాలి బరిపెట్టి దొంగ సాక్ష్యాలు పాఠం చెబుతారు. కొందరు మృదవర్లు తిరగేసి కొట్టమంటారు. నావంటి చాదస్తులం యింకొక కొందరం అట్టి పాపానికి వొడిగట్టుకోం గాని, మా పార్టీల తరపు సాక్ష్యులు కూడా అబద్ధం చెబుతున్నారని యెరిగిన్నీ వూరుకుంటాం. యిలాటి అసత్యానికి అంగీకరించవలసి వస్తుందనే, నేను ప్రాక్టీసు చాలా తగ్గించు కున్నాను. క్రమంగా ఈ వృత్తే మానుకోవడపు సంకల్పం కూడా వుంది. గిరీశ : అందరూ తమవంటి వకీళ్లే అయితే, అసత్యం అన్నది వుండనే వుండదండి. వకాలీలో యింత అక్రమం వుందన్నమాట నేనెరగనండి. యేమైనా సహించగలను గాని అసత్యం అన్నది సహించలేనండి. సౌజ : ఒక్క అసత్యంతో కుదరలేదు. సాధారణంగా వకాలీలో దురాచారాలు చాలా వున్నాయి. ఆంటి నాచ్ లాగనే, ఆంటీ వకీల్ అని ఒక మూవ్ మెంట్ మన దేశంలో స్టార్టు చెయ్యడపు అవశ్యకత కలిగేటట్టు కనపడుతుంది. హెడ్ కనిష్టబుది తప్పుకాదు. దొంగ సాక్ష్యం కలిస్తేనే గాని కేసులు గెలియవు. మీరు సత్యమార్గంలో తరిఫీదైన మనుష్యులు ఔటచేత, మీకు కేసులు నడిపించే మార్గాలు ఏహ్యంగా వున్నాయి. గిరీ : మరి మా అన్నగారి గతియేవిఁటండి? సౌజ : ఒక్కటే సాధనంవుంది. ఆ గుంటూరు శాస్త్రుల్లు యెవరో పోల్చి పట్టుగుంటే, యితర సాక్ష్యం అవసరం వుండదు. గిరీ : పట్టుపడే మార్గం యేదో తమరు శలవిస్తే మూడులోకాలూ గాలించి అయినా పట్టు గుంటానండి. సౌజ : మీయోగ్యతకు నాకు చాలా సంతోషంగావుంది. మీలాంటి యెంగ్ మెన్ లావుగావుంటే, మనదేశం బాగుపడును. మీ ప్రయత్నం సానుకూలంగా తగిన బందోబస్తు యావత్తూ కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 407