పుట:Gurujadalu.pdf/441

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అంటే, సిత్తం బాబూ అనాలి. “హేడు గారిని బదిలీ చేస్తాం, మరి భయపడకు”, అంటే సిత్తం బాబూ అనాలి. ఆ రాత్రి నేనూళ్లోవున్నానా బాబూ? లింగోరం సంతకి పోలేదా? సౌజ : మీ సాక్ష్యాన్ని, నమ్ముకొని లుబ్ధావధాన్లుగారికి నేను ధైర్యం చెప్పానే? పోలి : గొప్పధికార్లు! తమరు తలిస్తే ఆరికి నోటేటి బాబూ? కొవింటాడి మాటకొట్టెయ్కండి బాబూ, తమవంటోరుతలిస్తే, బాపన సాచ్చీకాలు నచ్చాపనచ్చలు. సౌజ : మీ యోగ్యత తెలిసింది. చాలు, యీపాటి వెళ్లండి. పోలి : (లేచి నిలబడి) కోపవాఁబాబూ? మేం బతగ్గలవాఁ? ఆవు నెయ్యి బాబూ గుమగుమ లాడేది ప్రతోరం పంపించుకుందునా బాబూ? సౌజ : మీ యినస్పెక్టరికి పంపండి. పోలి : (వెళ్లిపోతూ) ఆరంతోరు ఆరూ, తమంతోరు తమరూ. మాకిద్దరాహటి గాదా? సౌజ : చాలును వెళ్లండి, వెళ్లండి. పోలి : తమక్కోపవొస్తే, బతగ్గలవాఁ బాబూ., (గుమ్మం దాటి) బతిగాన్రా దేవుఁడా! పెందరకాళే యింటికి పోయి యెంకటేశ్శర్లుకి, అరశటాకు నెయ్యి దీవ్వెలిగిస్తాను. (నిష్క్రమించును.) ఆవ స్థలము : వీధి (అగ్నిహోత్రావధాన్లు, నాయడు ప్రవేశింతురు. ) అగ్ని : అషైతే కేసు మానుకొమ్మంఛారూ? నాయడు : లేకపోతే మీకు చాలా వుపద్రవం సంభవిస్తుంది. ఆ యింగిలీషు వకీలు అంతా పాడుచేశాడు. అగ్ని : అయితే, రావఁప్పంతులు ఉడాయించేసినట్టేనా? నాయడు : అందుకు సందేహవేఁవిఁటి? అగ్ని : నా కడియం, పట్టుకుపోయి, తాకట్టు పెట్టాడు. నాయడు : దానికి నీళ్లధారే. గురుజాడలు కన్యాశుల్కము - మలికూర్పు 396