పుట:Gurujadalu.pdf/440

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సౌజ : యింతసేపూ చెప్పారు కారేమి? రుగ్మత నిజమే ఐతే చాలా విచారవైఁన సంగతి మీకు సాక్ష్యం యలాగా తప్పదు. చెప్పే మాటలు ముందు వ్రాసుకుంటే మంచిది. లేకుంటే బోనెక్కిన తరవాత తత్తరపడిపోతారు. పది నిమిషములు పట్టదు. చెప్పండి వ్రాస్తాను. పోలి సాచ్చీకం తప్పదు బాబూ? సౌజ : యలా తప్పుతుందీ? నిజం తెలిసినవారు సాక్ష్యం పలకకపోతే మరియవరు పలుకుతారు? .

బాబూ -

పోలి తమరు పెద్దవొకీళ్లూ, కోవఁటోడి మాటని కొట్టేయక, యింటారా? సౌజ : వినకేమి? పోలి : నిజవేఁటి బాబూ? అబద్దవేంటి బాబూ? నేను చూసి నిజవాఁ చెప్పినాను? గుడ్డి మీదికేటి నిశిరాత్రేక నేను బైటకెల్డవేఁటి? జువ్విచెట్టుమీద పిశాచం అమాంతంగా సంపేసి పోదా! బాబూ? యేటి బాబూ సాచ్చీకానికి ముండ పోలిశెట్టి పోలిశెట్టే సెప్పాలా సాచ్చీకం బాబూ? తమంటి అధికార్లని చూస్తే, పాణం యెగిరిపోతుందిగదా? తమరు తలిస్తే సాచ్చీకానిక్కొడవా? బాపనోళ్లు నచ్చాపనచ్చలు. కొంచం సెయితడిజేస్తే సాచ్చికం చెప్పేసిపోతారు బాబూ - సౌజి : యీపాటి చాలించండి. దొంగ సాక్ష్యాలు నాదగ్గర పనికిరావు. నిజం తెలిసిన సాక్షులే నాకు కావాలి. పోలి : ఆపాటిమాట యెవరు సెప్పినారు కారు బాబూ; నిజం నాకేమీ తెల్దు, యేదేవుఁడు నెత్తికొట్టమంటే ఆ దేవుఁడు నెత్తి కొడతాను బాబూ. సౌజ : మరి యెరుగుదువఁని యెందుకు చెప్పారూ? పోలి : బాబూ, సెప్పనంటే కనిష్ఠీబోళ్ళు ఊరుకున్నారా? సౌజ : యిప్పుడు మాత్రం వూరుకుంటారా? పోలి : చెప్పితే, యిన్నీసిపికటరు పీక పిసికెడ్డు బాబూ! చెప్పకపోతే హెడ్డు కనిష్టబు పీక పిసకడా? పోలి : అధికార్లేటి చెయ్మంటే, మాలాటోళ్లు అదల్లా సెయ్యాలి గదా బాబూ - లేకుంటే పీక్కు రిగదా? “పోలిశెట్టి, సాచ్చికం సెప్పాలి” అని హేడ్డు గారంటే, సిత్తం బాబూ అనాలి; “పోలిశెట్టీ కబడదారు, సాచ్చికం చెప్పితే సంపేస్తాను” అని యిన్నీసిపికటరు గారు సౌజ : గురుజాడలు 395 కన్యాశుల్కము - మలికూర్పు