పుట:Gurujadalu.pdf/430

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సౌజ : నా మాట విని ఆస్తి యిచ్చివేసి, గిరీశం గారి మీద గ్రంధం చెయ్యడపు ప్రయత్నము మానుకుంటే, లుబ్ధావధాన్లు గారు మీ మీద తెచ్చిన కేసు తీయించి వేస్తాను. మీ పిల్ల మీద దయాదాక్షిణ్యాలు లేకపోతే, స్వలాభవైఁనా ఆలోచించుకోండి. అగ్ని : వెధవముండని లేవదీసుకుపోయిన పకీరువెధవ పక్షం మాట్లాడుతావు; యేవిఁ పెద్దమనిషివయ్యా? నేనా కేసు వొదులుకుంఛాను? ఆ వెధవ గానీ కంటికి కనపడితే, కూనీ చేస్తాను. పెద్ద ప్లీడరు ప్రత్యుద్ధానం చేసి పిలిచాడంటే, కేసుల్లో యేవిఁ సలహా చెబుతాడో అని భ్రమ పడ్డాను. వెధవముండలకి పెళ్లి చెయ్యడపు పోయీ కాలం పట్టుకుందేవిఁ, పెద్ద పెద్ద వాళ్లకి కూడాను? సౌజ : లుబ్ధావధాన్లు గారి తరఫున మీ మీద గ్రంధం నేనే నడిపించవలసి వుంటుంది. మీకు వృధాగా డబ్బు తట్టుబడీ, సిక్షా, క్షూణతా కూడా సంభవిస్తాయి గదా అని యింత దూరం చెప్పాను. మంచికి మీరు మనుషులైనట్టు కనపడదు. గనక నా చాయశక్తులా పనిచేసి మీకు గట్టి సిక్ష అయ్యేటట్టు గ్రంధం నడిపిస్తాను. పిల్ల దాని ఆస్తి విషయమయి దావా కూడా నేనే పడేస్తాను. అగ్ని : నీ యింట కోడి కాల్చా! సౌజ : మీరు యేమన్నా, నాకు కోపం లేదు. యింటికి వెళ్లి ఆలోచించుకుని, నా సహాయం కావలసివుంటే తిరిగీరండి. అగ్నిహోత్రావధాన్లు (నిష్క్రమించుతూ తనలో) వీడికి వెళ్లి గాబోలు! (తెరదించవలెను) గురుజాడలు 385 కన్యాశుల్కము - మలికూర్పు