పుట:Gurujadalu.pdf/429

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అగ్ని : అదంతా మీకెందుకయ్యా! ఓహో యిందుకా నన్ను పిలిపించారు? మీ గృహకృత్యాల వూసుకి నేవొచ్చానా యేవిఁటి? నా గృహకృత్యాల వూసు మీకెందుకూ? సౌజ : తొందరపడకండి అవుధాన్లుగారూ, దూరం ఆలోచించండి. మీ కడుపున బుట్టిన పిల్ల యొక్క సౌఖ్యం ఆలోచించి సలహా చెప్పాను గాని, నా స్వలాభం ఆలోచించి చెప్పు లేదు గదా - పెద్దపిల్లకి సంభవించిన అవస్థ మీ కళ్లతో చూడనే చూశారు. యికనైనా వృద్ధులకు పిల్లని కట్టబెట్టడుపు ప్రయత్నము చాలించండి. అగ్ని : నా పిల్లభారం అంతా మీదైనట్టు మాట్లాడుతున్నారేమిటి? ఆ సంత మీకెందుకూ? సౌజ : నన్ను తమ స్నేహవర్గంలో చేర్చుకోండి - పరాయివాణ్ణిగా భావించకండి - దయచేసి నా సలహా వినండి - మర్యాదగల యింట పుట్టిన బుద్ధివంతుడగు కుఱ్ఱవాణ్ణి చూసి, మీ చిన్నపిల్లని పెళ్లిచెయ్యండి. యిక పెద్ద పిల్ల మాట-ఆమెకు వితంతువుల మఠంలో, సంఘ సంస్కార సభవారు విద్యాబుద్ధులు చెప్పించుతారు. మీ కడుపున పుట్టినందుకు యెక్కడనయినా ఆమె సుఖంగా వుండడం గదా తండ్రైనవారు కోరవలసినది. ఆమె తాలూకు కొంత ఆస్తి తమ వద్ద వున్నది. మా స్నేహితులున్నూ, స్త్రీ పునర్వివాహ సభ కార్యాధ్యక్షులున్నూ అయిన రామయ్య పంతులుగారు నా పేర వ్రాసినారు. ఆ ఆస్తి, చిక్కులు పెట్టక, తాము ఆ పిల్లకి పంపించి వెయ్యడం మంచిది. అగ్ని : యేవిఁటీ ముండా యేడుపుసంత! వాడెవడు? వీడెవడు? మీరెవరు? అదెవర్త? నా పిల్లేఏంటి, పకీరు ముండ! రేపు యింటికి వెళుతూనే ఘటాశ్రాద్ధం పెట్టేస్తాను. సౌజ : యిప్పటి ఆగ్రహం మీద మీరు అలా శలవిచ్చినా, నిడివిమీద మీకే కనికరం పుడుతుంది. యిప్పట్లోనే మీరు కనికరిస్తే కొంత మీకు నేను ఉపకారం చెయ్యగలను. అగ్ని : కనికరం గాకేం, కడుపులో యేడుస్తున్నానుకానూ? ఆస్తీ గీస్తీ యమ్మంటే మాత్రం యిచ్చేవాణ్ణి కాను. ఆ వెధవని పెళ్లి చేసుకోకుండా యిల్లు జేరితే, యింట్లో బెట్టుకుం టాను. అంతే. సౌజ : అది మరి జరగదు. అగ్ని : యిదీ అంతకన్న జరగదు. సౌజ : ఆమె ఆస్తి మీరు యిచ్చి వెయ్యకపోతే దావా పడుతుంది. నిష్కారణం ఖర్చులు తగులుతవి. అగ్ని : నేను అగ్రహారపు చెయ్యిని - దావాగీవా అని బెదిరించితే భయపడేవాణ్ణి కాను. గురుజాడలు 384 కన్యాశుల్కము - మలికూర్పు