పుట:Gurujadalu.pdf/426

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మధు : ఆయన నాయుడు చేత రాయబారాలు పంపుతున్నారు. కరట : వెళ్లు, వెళ్లు, వెళ్లు, వెళ్లు, యింకా ఆలోచిస్తావేవిఁటి? నీ అదృష్టం నా అదృష్టం యేవఁని చెప్పను? మధు : వెళ్లతలచుకోలేదు. కరట : చంపి పోతివే! ఆయన ఒక్కడే మమ్మల్ని కాపాడగలిగినవాడు. మధు : యిటుపైని వూరకుక్కలనూ, సీమకుక్కలనూ దూరంగా వుంచడానికి ఆలోచిస్తున్నాను. కరట : ఆయనని హాస్యానికి సీమకుక్క అని అన్నాను గాని, యెంత రసికుడనుకున్నావు? చేతికి యెమిక లేదే! హెడ్డు కనిష్టబుపాటి చేశాడు కాడా? మధు : పట్టం వొదిలి పల్లెటూరు రాగానే, మీ దృష్టిలో, పలచనైతినో? హెడ్డును నౌఖరులా తిప్పుకున్నాను గాని, అధికం లేదే? ఆ నాలుగు రోజులూ, సర్కారు కొలువు మాని అతడు నా కొలువు చేశాడు. అతడి సాయం లేకపోతే, మీరు ఆ వూరి పొలిమేర దాటుదురా? ఈ దాసరి దాటునా? లోకం అంతా యేమి స్వప్రయోజక పరులూ! కరట : అపరాధం! అపరాధం! కలక్టరుని చూడనంటే, మనస్సు చివుక్కుమని అలా అన్నాను. నువ్వు ఆ గ్రామం గ్రామం సమూలం రాణీలాగ యేలడం నేను యీ కళ్లతో చూడలేదా? మధు : నేను కలక్టరును చూడనంటే, మీ మనస్సు చివుక్కుమనడం యెట్టిది? యేమి చిత్రం! సౌజన్యారావు పంతులుగారు యీ మాట వింటే సంతోషిస్తారు కాబోలు? కరట : పీక వుత్తరిస్తారు. మధు : అదేదో చూస్తాను. కరట : బ్రహ్మహత్య కట్టుకుంటావా యేవిఁటి? మధు : ఆహా! యేమి బ్రాహ్మలూ! - అయినా పోలిశెట్టి చెప్పినట్టు, యెంత చెడ్డా బ్రాహ్మలు గదా? యిందండి; (కంటె యిచ్చును) తిలోదకాలేనా? కరట : యెంతమాట! పువ్వులలో పెట్టి మళ్లీ రాదా? నీ యెదట అనవలిసిన మాట కాదు, నీలాంటి మనిషి మరిలేదు. కించిత్ తిక్క లేకుంటేనా! మధు : ఆ తిక్కే గదా యిప్పుడు మీకు వుపచరిస్తూంది? కరట : యేం వుపచరించడం? చంపేశావు! ఆ డిప్ట్ కలక్టర్ని ఒక్క మాటు చూసి యీ బీద ప్రాణిని కాపాడితే - గురుజాడలు 381 కన్యాశుల్కము - మలికూర్పు