పుట:Gurujadalu.pdf/424

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కరట : అంత చాకచక్యం నీకు లేదని కాదు. (మధురవాణి లోనికి వెళ్లును) కరట : అది చెప్పిందల్లా చెయ్యక, కొంచంపై ఒచ్చేది కానీ, మరీ నడుస్తూవుండు, యేవైఁనా వుంటే, నా చెవిని పడేస్తూండు. శిష్యు : యవరిదగ్గిర వున్నప్పుడు వారు చెప్పిందల్లా చెయ్యడవేఁ, నా నిర్ణయం. మీరు యేంపై కాని, నా చేత ఆడవేషం వేయించి పెళ్లి చేశారో? కరట : ప్రమాదోధీమతామవి. యంతటివాడికైనా ఒకప్పుడు కాలుజారుతుందిరా. (మధురవాణి కంటే పట్టుకు ప్రవేశించి) మధు : తాకట్టు వస్తువ తప్పించుకు పారిపోతేనో? కుక్కా? నక్కా కాదు గదా గొలుసులు వేసి కట్టడానికి? కరట : నీ వలల్లో పడ్డ ప్రాణి మరి తప్పించుపోవడం యలాగ? వాటికి వున్న పటుత్వం యేవుక్కు గొలుసులకూ వుండదు. మధు : వలలో ముత్యపు చిప్పలు పడితే లాభం గాని, నత్తగుల్లలు పడితే మోతచేటు. కరట : యంతసేపూ డబ్బు, డబ్బేనా? స్నేహం, వలపూ, అనేవి వుంటాయా? మధు : స్నేహం మీలాటి వారిచోట; అందుచేతనే, కష్టపడి ఆర్జించిన కంటె మీపాలు చేస్తున్నాను. మా తల్లి చూస్తే భవిష్యం వుంచునా? యిక వలపో? బతుకనేది వుంటే, వలపు వన్నె తెస్తుంది. అంగడి వాడికి మిఠాయి మీద ఆశా, సాని దానికి వలపూ, మనస్సులోనే మణగాలి; కొద్ది కాలం వుండే యవ్వనాన్ని జీవనాధారంగా చేసుకున్న మా కులానికి వలపు ఒక్కచోటే. కరట : యక్కడో? మధు : బంగారం మీద. శృంగారం వన్నె చెడిన దగ్గర నుంచీ, బంగారం గదా తేటు తేవాలి? ఆ బంగారం మీకు ధారపోస్తూ వున్నప్పుడు నా స్నేహం యెన్ననేల? కరట : నీ స్నేహం చెప్పేదేవిఁటి? గాని నీ యౌవ్వనం, నీ శృంగారం దేవతా స్త్రీలకు వలె శాశ్వతంగా వుంటాయి. మధు : మా తల్లి ధర్మవాఁ అని, ఆమె నా చెవిలో గూడు కట్టుకుని బుద్ధులు చెప్పబట్టి గాని, లేకుంటే మీలాంటి విద్వాంసుల యిచ్చకాలకి మైమరచి, యీపాటి వూళ్లో సానులవలె చెడివుండనా? గురుజాడలు 379 కన్యాశుల్కము - మలికూర్పు