పుట:Gurujadalu.pdf/423

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మధు : ఈ కేసులో నిజవేఁదో సౌజన్యారావు పంతులు గారితో చెప్పి మీరు కూడా - కొంచం లోకోపకారం చెయ్యరాదా? కరట : మా మంచి సలహా చెప్పావు! తనకు మాలిన ధర్మమా? 'స్వయంతీర్ణః పరాంసారయతీ” అన్నాడు. నిజం చెబితే పంతులు యేవంటాడో నీకు తెలుసునా? శాస్తులు గారూ మీరు నేరం చేశారు, నేనేమి చెయ్యగలను? మిమ్మును గురించి నాకు చాలా విచారంగా వున్నది” అని వగుస్తూ, పోలీసువాళ్లతో చెప్పి, జైయిలులోకి వప్ప చెప్తాడు. జైయిలు నుంచి తిరిగి వచ్చిందాకా మాత్రం నెలకో పాతికో, పరకో కనికరించి నా భార్యాకు యిస్తూ వుంటాడు. అలాంటి ప్రమాదం లేకుండా కార్యసాను కూలం కావఁడంకోసమే యీ యెత్తు యెత్తాను. మధు : సరే, సౌజన్యారావు పంతులుగారు మంచివారు గనక ఆయనదాకా వస్తే నా కంటే నాకు యిప్పించేస్తారు. గాని, లుబ్ధావధాన్లు ఆ రూపాయలూ, కంటా, పెట్లో పెట్టుకుని ముంగిలా మాట్లాడకుండా వూరుకుంటేనో? కరట : దాని ఖరీదు నేనిచ్చుకుంటాను. మధు : తమరు ఒకవేళ మఠంలో ప్రవేశిస్తే మరి నాకు కంటె ఖరీదు యిచ్చేవారెవరు? అందుచేత ఆ కంటే నాకు తిరిగి వచ్చేవరకూ మీ శిష్యుణ్ణి నా దగ్గిర తాకట్టు వుంచండి. కరట : అలాగనే. శిష్యు : మీ సొమ్మేంబోయింది. నా పెళ్లా? కరట : నాలికా? తాటిపట్టెరా? శిష్యు : మీరో వేళ - జయిల్లోకి వెళితే మధు : గురువుకు తగిన శిష్యుడి వైదువు! కరట : అంత ఉపద్రం వొస్తే, నీ పెళ్లి మాట నా పెళ్లంతో యరేంజిమెంటు చేసి మరీ వెళతాను. శిష్యు : యేమో! ఘోరవైఁన ప్రమాణం చేశారు గదా? కరట : మధురవాణీ, కొంచెం శ్రమచేసి కంటెతేవా? మధు : యేవొచ్చిందీ తొందర? కరట : హెడ్డు గాని, రామప్పంతులు గాని, వొచ్చాడంటే, నా కొంప ములుగుతుంది. మధు : ములిగితే తేలుస్తాను. గురుజాడలు 378 కన్యాశుల్కము - మలికూర్పు