పుట:Gurujadalu.pdf/415

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆవ స్థలము : లుబ్ధావధాన్లు బస లుబ్ధా :(ప్రవేశించి) ఏమి దురవస్థ వచ్చిందీ! నా అంత దురదృష్టవంతుడు లోకంలో యవడూ లేడు. యేల్నాడి శని రాగానే కాశీకి బయల్దేరి పోవలసింది. బుద్ధి తక్కువ పని చేశాను. యిలా రాసివుండగా యెలా తప్పుతుంది. సౌజన్యరావు పంతులు దేవుఁడు. ఆయనలాంటి వాళ్లు వుండబట్టే వర్షాలు కురుస్తున్నాయి. ఆయన శలవిచ్చినట్టు తప్పంతా నా యందు ఉంచుకొని విధిని నిందించడవెఁందుకు? ఇంత డబ్బుండిన్నీ, డబ్బుకి లోభపడి ఒక్కగా నొక్క కూతుర్ని ముసలివాడికి అమ్మాను. నా జీవానికి ఉసురుమంటూ అది కాని తిరుగులు తిరిగిందంటే దాని తప్పా? బుద్ధితక్కువ వెధవని, ముసలితనంలో నాకు పెళ్లేం? దొంగముండా కొడుకని తెలిసిన్నీ ఆ రావఁప్పంతుల్ని నేన్నమ్మడవేఁ వి? ఆ మాయగుంట పారిపోవడవేఁవి? కంటికి, ఆ అల్లరేమి? ఆ యినసిపికటరు కూనీ చేశావని మమ్మల్ని సలపెట్టడవేవిఁటి? అంతా ఘోరకలి; కలి నిండిపోతూంది. ఒక్క సౌజన్యారావు పంతులు సత్యసంధుడు నాకు కనపడుతున్నాడు. కడవంతా వకీళ్లూ, పోలీసులూ, పచ్చిప దొంగలు - ఆయన చక్రం అడ్డువేసి, మమ్మల్ని యీ ఆపదలోంచి తప్పించారంటే కాసేవాసం పోతాం-యేమి చిత్రాలు! వెధవలకి మఠం కట్టారట! యన్నడూ వినలేదు. అమ్మిని వెళ్లి ఆ మఠం చూడమంటాను. దానికి యిష్టం కలిగిందా, దానికి కావలిసిన డబ్బు యిస్తాను. ఆ మఠంలో వుంటుంది. లేకుంటే నాతోపాటు కాసేవాసం. ( రామప్పంతులు ప్రవేశించును) కంటే, గింటే అని నాతో మీరు ప్రశంసించి కార్యం లేదు. రామ : ఆ కంటే మాట ప్రశంసించడానికి రాలేదు మావాఁ. ఆ కంటె మధురవాణిది, మీరెర గరా? అదీ, మీరూ యేం జేసుకుంటారో నాకేం కావాలి? కంటె సిగ కోసిరి గాని, మీకు ఓ గొప్ప సాయం చెయ్యడానికి వొచ్చాను. మీ అవస్థ చూస్తే నా గుండె నీరైపోతూంది. లుబ్ధా : మహాప్రభో! నీకు పదివేల నమస్కారాలు. యిక, యీ పకీరు వెధవని వదిలెయ్యి, “రామనామ తారకం భక్తిముక్తిదాయకం| జానకీమ” - రామ : రామ! రామ! యంతమాట అంటివయ్యా! మీరు ఆపదలో వుండి విరక్తి చేత యేమి మాటలన్నా అవి పడి, పని చెయ్యడం నాకు విధి. చెప్పేమాట చెవిని బెట్టండి. ముందూ వెనకా చూడడానికి యిహ టైము లేదు. వ్యవహారం అంతా సూక్ష్మంగా పొత్తు పరుచుకు వొచ్చాను. రెండు సంచులతో, కూనీకేసంతా మంచు విడిపోయినట్టు లుద్దా : గురుజాడలు 370 కన్యాశుల్కము - మలికూర్పు