పుట:Gurujadalu.pdf/416

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విడిపోతుంది. ఒక్క యిన స్పెక్టరుతో కుదరలేదు. డిప్ట్ కలక్టరికి కూడా చెయ్యి తడి చెయ్యాలి - మీ దగ్గర యిప్పుడు సొమ్ము లేదంటిరా, ఒక చోట వ్యవహారం కూడా పొద్దుపర్చాను. ప్రాంసరీ నోటు మీద యెన్ని రూపాయలు కావలిస్తే అన్ని రూపాయ లిస్తారు. లుబ్ధి : నేను వక దమ్మిడీ యివ్వను. “రామనామ తారకం, భక్తిముక్తి దాయకం, జానకీ మనోహరం, సర్వలోక నాయకం.” రామ : నా మాట విను. యంతో ప్రయాసం మీద యీ ఘట్టం కుదిర్చాను. తాసీల్దారు మీ దగ్గిర లంచం పుచ్చుకుని కూనీ కేసు కామాపు చేశాడని, యినస్పెకటరు డిప్ట్ కలక్టరికి గట్టిగా బోధపర్చాడు. కలక్టరు సలహా మీద యినస్పెక్టరు చాలా పట్టుదలగా పనిచేసి, సాక్ష్యం అంతా రడీ చేశాడు. కేసు రుజువైనట్టాయనా యాహౌఁతుందో ఆలోచించు కోండి. లుబ్ధా : నీ కెందుకు నా యేడుపు? రామ : డిప్ట్ కలక్టరు బ్రహ్మద్వేషి - తాసిల్దారు తాడు ముందు తెగుతుంది. తరువాత మిమ్మల్నీ, మీనాక్షినీ కమ్మెంటు కట్టేస్తాడు - వురిసిద్ధం. నాకూ యిన స్పెక్టరికీ వుండే స్నేహం చేత యీ ఘట్టానికి వొప్పించాను. గనక నా మాటకి చెవొగ్గి యీ ఆపద తప్పించుకోండి. లుబ్ధి : నన్ను బాధపెట్టక నీ మానాన్న నువ్వుపోదూ. “రామనామతారకం1 భక్తిముక్తిదాయకం.!! రామ : నీ అంత కర్కోటకుణ్ణి యక్కడా నేను చూడలేదు. నీ మాటకేం పెద్ద వాడివి పసిపిల్ల, కడుపున కన్న మీనాక్షికి వురి సిద్ధం అయితే, ముండా డబ్బుకి ముందూ వెనకా చూస్తావు! తలుచుకుంటే నా హృదయం కరిగిపోతూంది. (సౌజన్యారావు పంతులు ప్రవేశించును.) రామ : తమరు ధర్మ స్వరూపులు. లుబ్ధావధాన్లు గారి యందు అకారణమైన దయచేత యీ కేసులో పని చేస్తున్నారు. కేసంతా వట్టి అన్యాయమండి. ఒక్క పిసరైనా నిజం లేదు. శలవైతే గట్టి డిఫెన్సు సాక్ష్యం - సౌజన్యా :నీ సంగతి నాకు తెలుసును. అవతలకి నడువు. రామ : తమరు యోగ్యులూ, గొప్పవారూ అయినా, ఏక వచన ప్రయోగం - సౌజన్య: నడువు! (రామప్పంతులు నిష్క్రమించును) గురుజాడలు 371 కన్యాశుల్కము - మలికూర్పు