పుట:Gurujadalu.pdf/406

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామ : యేవిఁటీ అపశగునం పాటా? శిష్యుడు : “కట్టలే చుట్టాలు, కట్టెలే బంధువులు కన్నతల్లెవ్వరే చిలుకా?” రామ : చుట్టాలా? వొక్క అప్పవుంది, అది యెప్పుడూ నా గుమ్మంలో అడుగుబెట్టలేదు. యిప్పుడు యింటికి యజమాని యెవరూ? తలుపవతల సాని లంజా, తలుపివతల సంసారి వెధవ లంజానూ; యిద్దరూ కలిసి యిల్లు చేరకుండా నన్ను తగుల్తున్నారు. శిష్యుడు : “నిన్ను మోసేరు నలుగురు, వెంబడిని పదిమంది|" రామ : వెజ్జి ముండాపాటా! పోదాం. (గబగబ కొంత దూరము నడచి, నిలుచుని) యీ తోవనే వొస్తున్నాడు కాబోలు - అదుగో పాట వినబడుతూంది?) “నువ్వు కాలిపోయేదాక కావలుందురు గాని కడకు తొలగొత్తురు వెంట నెవరూ రారు చీలుకా” రామ : వెజ్జి ముండాపాటా! శిష్యుడు : పంతులుగారూ! యక్కడున్నారు? రామ : పరుగుచ్చుకోకపోతే పట్టుగుంటుంది. (పరిగెత్తును) కన్యాశుల్కము షష్ఠాంకము గవ స్థలము: రామచంద్రపురం అగ్రహారంలో) (చెఱువు గట్టున వున్న తోటలోనికి పెళ్లివారి బళ్లు వచ్చును. గట్టుమీద ఒక వైపు అగ్నిహోత్రావధాన్లు, రెండవ వైపు పళ్ళు తోమికొనుచు రామప్పంతులును) అగ్ని : బళ్లు దింపండి. బళ్లు దింపండి. సాయేబూ యేనుక్కి కావలసినంత రొడ్డ. చెఱువు స్నానానికి బహు బాగా వుంది. యెవరయా చెఱువు గట్టు మీద? రామ : (తనలో) అరే! మరిచితిని. యీవేళే కదా పెళ్లివారు రావలసిన రోజు? (పైకి) నా పేరు రామప్పంతులంటారు. గురుజాడలు కన్యాశుల్కము - మలికూర్పు 361