పుట:Gurujadalu.pdf/405

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామ : మధురవాణీ! నీకు మతిపోతూంది - నా యింటికి నువ్వా యజమానివి? తలుపు తీయ్యి, మధు : నిలబడండి. కర్పూరం వెలిగించి, మంగళ హారతి పళ్లెం తెస్తాను. (తలుపు దగ్గర నుంచి లోనికి వెళ్లును). రామ : (తలుపు సందులోనుంచి చూసి, తరవాత మీనాక్షిని ముద్దెట్టుకొని) యెంత పని చేశావూ! దాంతో చెప్పేశావు! రహస్యంగా లేచిపోయి పెళ్లి చేసుకోవాలి గానీ, అల్లరి చేసుకుంటే యలాగ? మీనా : యెప్పుడైనా అందరికీ తెలిసేదే గదా? రామ : నా మాట విని యిప్పుడు యింటికి వెళ్లిపో. మీనా : యిహ మా యింటికి వెళ్లను. యిదే మా ఇల్లు; మధురవాణి తలుపు తీస్తుంది; లోపలికి వెళదాం. రామ : అయితే యిక్కడ వుండు యిప్పుడే వస్తాను. (కొన్ని అడుగులు వీధంట నడచి, నిలచి) నిజంగా మంగళహార్తి తెస్తుంది కాబోలు పెంకె లంజ? అది తలుపు తీయ్యకపోయెనా, మీనాక్షి నన్ను వెతకడానికి బయల్దేరుతుంది. తెల్లవారవచ్చింది-చెరువ్వేపు పోయి కాలకృత్యాలు తీర్చుకుని ఆపై చర్య ఆలోచిద్దాం. రెండ్రోజులు పైకి వుడాయించానంటే, మళ్లీ వచ్చేసరికి కొంత అల్లరి సద్దుకుంటుంది. తలుపు తీసినట్టు కానరాదు. యవడిల్లు? యవర్తె యిది నన్ను అడ్డడానికి? ఆశ్చర్యం! (కొంత దూరంగా వీధిలో నిలబడి, దాసరి వేషంతో శిష్యుడు చితారుమీటి పాడును) చరణం || “యిల్లు యిల్లనియేవు | యిల్లు నాదనియేవు నీ యిల్లుయెక్కడే చిలుకా?” రామ : యిది నా యిల్లు కాదా? శిష్యుడు : “ఊరికి ఉత్తరాన, సమాధి పురములో) కబ్జె యిల్లున్నదే చిలుకా!” రామ : వల్లకాట్లోనా? శిష్యుడు : పల్లవి|| “యెన్నాళ్ళు బ్రతికినా! యేమి సామ్రాజ్యమే| కొన్నాళ్ళకో రామచిలకా?"|| అనుపల్లవి : “ముఢాళ్ల బతుకునకు, మురిసేవు త్రుళ్ళేవు, ముందుగతి కానవే చిలుకా” గురుజాడలు 360 కన్యాశుల్కము - మలికూర్పు