పుట:Gurujadalu.pdf/404

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామ : కంటే, కంటె, అని తపిస్తున్నావేవిఁటి? నిలబడ్డ పాటున నూరు కంటెలు కురిపిస్తాను. మధు : నూరు కంటెలూ మీరు వుంచుకొని, నావొక్కకంటే నాకిచ్చి, మరీ యింట్లో అడుగు పెట్టండి. రామ : రేపు పొగలు కాని కంటె యివ్వనన్నాడు లుబ్ధావధాన్లు? మధు : రేపే యింట్లో కొత్తురు గానీ, మించిపోయిందేవీఁలేదు. రామ : యింతట్లో చిట్టెడ మీదపడితే. మధు : సకేశా? అకేశా? రామ : పిల్లికి చెలగాటం, యలక్కి ప్రాణ పోకటా! (మీనాక్షి ప్రవేశించి, రామప్పంతులు రెక్క పట్టుకొనును) మీనా : దీపం ఆర్పి ప్రమాణం చేశావు - తప్పితే తలపగిలిపోతుంది. రామ : పోముండా! మీనా : మీ కాగల పెళ్లాన్ని గదా యెక్కడికి పోతాను? మధు : కాగల పెవేఁవింటి? మీనా : నిన్ను వొదిలేసి, నన్ను రాజమేంద్రం తీసుకు పోయి పెళ్లాడతానన్నాడు - దీపవాఁర్పి ప్రమాణం చేశాడు. మరెలా తప్పుతాడు? మధు : యీవిడేనా ఆకు చిట్టడ? రామ : ముండా, నాచెయ్యొదిలెయ్ - నిన్ను నే పెళ్లాడతానన్నానే? కలగన్నావా యేవిఁటి? (మీనాక్షిని విదిపించుకొనగా మీనాక్షి కిందపడును) మధు : ఆడదానిమీదా చెయి జేసుకుంటారు? యేమి పౌరుషం! అబద్ధవాఁడక అన్నమాట నిలబెట్టుకోండి.యేం? కులం తక్కువా? రూపం తక్కువా? ఆమె బతుకు భ్రష్టు చెయ్యనే చేశారు; పెళ్లాడి తప్పు దిద్దుకోండి-ఆవిణ్ణి పెళ్లాడి వొస్తేనే నేను తలుపు తీస్తాను. మీనా : పంతులు నన్ను కాగలించుకుని యెత్తుకుంటే మా నాన్న చూసి, తన్ని, యిద్దర్నీ యింట్లోంచి తగిలేశాడు. నువ్వు హెడ్డు కనీజ్జీబుతో పోతున్నావు, నిన్నొదిలేసి నన్ను పెళ్లాడతానని వొట్టేసుకున్నాడు. నన్ను లేవదీసుకొచ్చి, నన్ను పెళ్లాడక తప్పుతుందాయేమిటి? మధు : అవస్యం పెళ్లాడవలిసిందే - పెళ్లాడక పోతే నువ్వు మాత్రం వూరుకుంటావూ? దావా తెస్తావు - పంతులు గారికి దావాలంటే సరదానే! కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 359