పుట:Gurujadalu.pdf/399

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కవ స్థలము : లుబ్ధావధాన్లు యింటి నడవ (తలుపు జారవేసి వుండును) (మీనాక్షి ప్రవిదతో దీపం తెచ్చి గూటిలో వుంచును. రామప్పంతులు వొత్తి తగ్గించి, మీనాక్షిని ముద్దుబెట్టుకొనును) మీనాక్షీ: తోవ తప్పొచ్చారో? రామ : బుద్ధి తక్కువ చేత, గడ్డితిని యిన్నాళ్లూ తోవ మరచాను. మీనా: మధురవాణి యలా రానిచ్చింది? రామ : మధురవాణి శిగోశిరి, దాన్ని వదిలేస్తాను. ఆకలి దహించుకుపోతూంది. ఫలారం యేవైఁనా వుందీ? మీనాక్షి: యేవుందీ? వొడపప్పూ, కొబ్బరిముక్కా కావాలా? రామ : యేదో ఒహటి తెస్తూ. (మీనాక్షి మూకుడుతో వడపప్పూ కొబ్బరి ముక్కలూ తెచ్చును. రామప్పంతులు తినుచుండును) మీనాక్షి: మధురవాణిని వొదిలేస్తారో? రామ : వొదిలెయడం నిశ్చయవైఁపోయింది. మీనాక్షి: కనిష్టీబు మాట తెలిసిందో? రామ : తెలిసింది. మీనాక్షీ: యవరు చెప్పారు? రామ : అసిరిగాడు. మీనాక్షి: మా అసిరిగాడా? రామ : మీ అసిరిగాడే. (అసిరిగాడు వీధి తలుపు కొంచం తీసి తొంగి చూసి) అసిరి : దెయ్యానికెట్టింది తింతున్నావయ్యా? రామ : దెయ్యానికా పెట్టారు? మీనాక్షి: (అసిరిగాడితో) వూరుకో వెధవా. రామ : నీకు న్యాయవేఁనా? దిగదుడుపు కూడు పెట్టడం? (వీధులోకి వెళ్లి వమనము చేసికొనుటకు ప్రయత్నము చేసి తిరిగి ప్రవేశించి) వమనవైంది కాదు. యేం సాధనం? కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 354