పుట:Gurujadalu.pdf/400

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామ : మీనాక్షి: దిగదుడుపు కాదంటే నమ్మరు కదా? రామ : మూకుళ్ళ తగలేశావు? మీనాక్షి: దెయ్యం తిని సచ్చిందా, యేవిఁటి? ఆడవాళ్ళు దారుణం మనుషులు! మీనాక్షి: అసిరిగాడేం చెప్పాడు మధురవాణి మాట. అసిరి : (తిరిగి తొంగి చూచి) ఆ పారేసిందట్టుకు పోదునా బాబు? రామ : పట్టుకుపో. (అసిరిగాడు పట్టుకుపోవును) మీనాక్షి: వాడికి మీ కంటే ధైర్యం వుంది. రామ : అపవిత్రం ముండాకొడుకు యేవైఁనా తింటాడు. బ్రాహ్మలం పవిత్రవ్కైన వాళ్లం గదా! మీనాక్షి: పవిత్రం అంటే, మీదీ, నాదే! రామ : అదేం అలా అంటున్నావు? మీనాక్షి: నేను వెధవముండనీ, మీరు సరసులున్నూ, మనకంటే మరి పవిత్రం అయిన వారు యవరుంటారు? రామ : ఆకళంకం తీసెయ్యడానికే యీ వేళాచ్చాను. మీనాక్షి: యలా తీసేస్తారు? రామ : మనయిద్దరం పెళ్లాడితే మరి అపవిత్రత యెక్కడుంటుంది? మీనాక్షి: యేవిఁటీ! రామ : మనం పెళ్లాడదాం? మీనాక్షి: నిజంగాను? రామ : యేం వొట్టు వేసుకొమ్మన్నావు? మీనాక్షి: ఆ దీపం ఆర్పెయ్యండీ. రామ : యీ కాగితం ముక్కలు చదివి మరీ ఆర్పేస్తాను. (కాగితం ముక్కలు జేబులోంచి తీసి చదివి) గాడిద కొడుకు తన బాకీ తాలూకు నోటు లాగి, నన్ను దగా చేశాడు; వీడి తాళం పడతాను. గురుజాడలు 355 కన్యాశుల్కము - మలికూర్పు