పుట:Gurujadalu.pdf/391

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

డమే ఉత్తమం అంటాను. మా సూపరెంటు పిల్లలతో వున్న రెండో పెళ్లి దొరసాన్ని పెళ్లాడి సుఖంగా వుండలేదా? మునస: మావఁగారి అబిప్పరాయం, పెయ్యతో టొచ్చిన ఆవు మేలు కాదా అని? అందకనే, ముసలి బాపనోడు యెధవ గుంటని పెళ్లాడితే, మీ నేస్తం కరణపోణ్ణి, ఆ ముసలాడి యెధవ కూతుర్ని పెళ్లాడమని బోదసెయ్యరాదా? హవ : మనకేల మావాఁ? గవునర్మెంటా, దేవుళ్లూ బ్రాహ్మలూ - వారి నేరాలు వారివి వాటితో మనకి పని లేదు. మన భక్తి మనకుండాలి. (హెడ్ ) భాయీ, తెల్లా నల్లా వొకటా? - తెల్లవాడికి క్రీస్తువొక పద్ధతి పెట్టాడు. ముసల్ మాన్ కి పైగంబరు వొక పద్ధతి పెట్టాడు, నల్లవాడికి రాముడు వొక పద్ధతి పెట్టాడు. భగవంతుడు తెల్లవాడితో యేవఁన్నాడూ? వెధవని పెళ్ళాడు అన్నాడు. రాముడు తెనుగువాడితో యేవఁన్నాడూ? వెధవని పెళ్లాడొద్దన్నాడు. చెప్పన్న దేశాలూ చూశాను భాయీ. పరిపరి విధాలు ఆచారాలూ, వ్యవహారాలూ వున్నాయి గాని నీతి వకటి, భగవంతుడొకడూ, అంతటా వక్కటే. మునస: రాముడు యెదవ ముండల్ని కాని పనులు సెయమన్నాడూ? మన్లో మారు మనువులుండేవి కావా?

పిల్లా, చిలుం భరాయించి, తే. మునస: నామాలోడు మూలకి తీసికెళ్లి పిల్లని ముద్దెట్టుకుంటున్నాడు. యోగిని : (చెయ్యి విడిపించుకొని సిగ్గుతో) ఏకాంత ఉపదేశం చేస్తున్నారు. మునస : యేటో ఆ వుప్పుదేశం? తనెంట వాయు యేగంగా రమ్మనా? దుకా : యేవిఁటి భాయీ? అనరాని మాట్లు అంటున్నారు. మనయోగిని పరమ భక్తురాలు. మునస: లెంపలోయించుకుంటాను. పిల్లా! ఆనామోలోడు సెప్పిన ఉప్పుదేశవేఁటో, నా సెవులో కొంచెం సెప్పరాదా? (యోగిని సారాగజాసు హవల్దార్ యెదట వుంచును) మునస : నామాలోడి వుప్పుదేశంతో పిల్లకి మతోయింది. బైరాగి : హవల్దారు గారు అమృతం సేవించరా? (చిరునవ్వు నవ్వి) తాక్క సోజరు వాడు చెడ్డాడు, తాగి సిపాయివాడు చెడ్డాడు. జ్ఞానికి జ్ఞానపత్రి, తాగుబోతుకు సారాయి. గురుజాడలు కన్యాశుల్కము - మలికూర్పు 346