పుట:Gurujadalu.pdf/392

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మునస : పించను పుచ్చుకుంటివి గదా, యింకా సిపాయానా సెయ్యాల్నుందా, అల్లుడోడా? హవ : కుంపిణీ నమ్మక్ తిన్న తరువాత, ప్రాణం వున్నంత కాలం కుంపిణీ బావుటాకి కొలువు చెయ్యాలి. రేపు రుషియాతో యుద్ధం వొస్తే పించను ఫిరకా యావత్తూ బుజాన్ని తుపాకీ వెయ్యమాం ? మనస : రుస్సావోడి వోడ నీట్లో ములిగి నడస్తాది గదా, నువ్వు తుపాకుతో యవణ్ణి కొడతావు? హవ : మొన్నగాక మొన్న యంగిరీజ్ రుషియా దేశానికి దండెత్తిపోయి, రుషియాని తన్ని తగలలేదా? అప్పుడే వైఁందో, యిప్పుడూ అదే అవుతుంది. మా రాణీ చల్లగా వుండాలి. దుకా : సీవఁరాణీ ఆ కాళీమాయి అవుతారం కాదా? హవ : కాళీ, గోళీ, జాంతేనై - ఆ రాముడి అవతారం. దుకా : గురూ - హవల్దారుగారు తత్తకీర్తనలు మాయింపుగా పాడతారు. (యోగినితో) తల్లీ, నా తంబూరా తెచ్చి భాయిగారికి ఇయ్యి. మునస: యీతూరి, యీరేచ వుప్పుదేశం చేస్తున్నాడు. దుకా : గొప్పవారున్నప్పుడు ఆస్యాలేటి భాయీ? మునస: వున్నమాటాడితే ఆస్సాలా? నాకెవడూ సెయడేం వుప్పుదేశం? యీరేచ వుప్పుదేశం గట్టిగా బిగిసింది; మరి సెయ్యొదలు - (యోగిని కష్టం మీద చెయ్యి వొదిలించుకొని తంబురా తెచ్చియిచ్చును) దుకా : అవన్నీ గ్యానరహశ్శాలు. బ్రమ్మానందవఁంటే యేటి? కడుపునిండా సారా; ముక్కు నిండా పొగ; పక్కని పడుచుపిల్లా కదా? మునస: ఘానం యినండొస్సి - హవ : పామరం ! పామరం! రాముడు పఠం కాళీ నెత్తి మీద పెట్టకపోతే కుంపిణీ సిపాయన్న వాడు యిక్కడికి వొచ్చునా? హెడ్డు : భాయీ ! ఓ కీర్తన శలవియ్యండి. (హవల్దారు పాడును.) పింజర్మె రహకర్ ఛుప్ నైరహ్న క్యారే బుల్బుల్ కహొ ముల్కిసునా| క్యారె|| యెక్కడికి వెళతావు? యేమి చెప్పవు, బోలో పింజర్మె!! (వీరేశ శంఖం మనవాళ్లయ్య తీసి పూరించును. ) గురుజాడలు కన్యాశుల్కము - మలికూర్పు 347