పుట:Gurujadalu.pdf/383

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామ : మీరు పెట్టమంటే, నేను యెరువు తెచ్చాను కానా? లుబ్దా : నేను పెట్టమన్లేదు. రామ అయితే దొబ్బేస్తావా యేవిఁటి? మీ భార్యా మెళ్లో యిప్పుడా కంట లేదూ? లుబ్ధి : నా భార్యా యెవరు? నా భార్యా నాడే చచ్చింది. రామ : మొన్న మీరు పెళ్లి చేసుకున్న పిల్ల మీ భార్యా కాదటయ్యా? లుబ్ధా : రెండో పెళ్లి ముండ నాకు భార్యా యేవిఁటి? రామ : రెండో పెళ్లి ముండేవిఁటి? లుబ్దా

రెండో పెళ్లి ముండ అని నువ్వే అన్నావు?

రామ : మాటమీద మాటొచ్చి, వొట్టినే అంటే, అదో దెప్పా? లుబా : వొట్టినే అనలేదు. గట్టే అన్నావు. యిదంతా, ఆ గుంటూరు శాస్తుల్లూ నువ్వూ చేసిన కుట్ర; నాకు నిజం తెలిసిపోయింది. ఆ ముండ నీ యింటికే వెళ్లింది. మధురవాణిని వుంచుకున్నట్టు దాన్ని కూడా నువ్వే వుంచుకో. నా జోలికి రాకు. నీకు పదివేల నమస్కారాలు. రామ : నా కంట నాకియ్యమంటే, యీ వెళ్లి వెళ్లి మాట లేవిఁటయ్యా? లుబా : నీ మాయగుంటా, నీ కంటా, నీ యింట్లోనే వున్నాయి. రామ : యీ వేషాలు నాకు పనికిరావు. నిలబెట్టి నా కంట పుచ్చుకుంటాను. (తడిసిన భాగవత పుస్తకం పట్టుకుని మీనాక్షీ, చేతులో కట్టా, నెత్తిమీద పసుపురాసినకుండా, అందుమీద అఖండంతో అసిరిగాడూ, చేతిలో సీసాపట్టుకుని, తడి బట్టలతో పూజారి గవరయ్యా ప్రవేశింతురు.) పూజారీ : హోం! హౌం! హ్రూం! ఓంకార భైరవీ! ( రామప్పంతులు భయమును కనపర్చును) మీనాక్షి: యక్కడా కనపర్లేదు నాన్నా. యీ పుస్తకం నూతులో పడేశింది. (లుబ్ధావధాన్లు భయమును కనపర్చును. ) రామ : కనపడకపోవడం యవరు? మీనా : నా సవిత్తల్లి - గవరయబాబు నూతులో దిగి అంతటా గాలించాడు. నూతులో మరేవీఁ కనపడలేదు. (లుబ్ధావధాన్లు భయం తగ్గును. ) గురుజాడలు 338 కన్యాశుల్కము - మలికూర్పు