పుట:Gurujadalu.pdf/384

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లుబ్ధా : వేరే బ్రహ్మ రాక్షసిని గవరయ బాబు యీ సీసాలో బిగించాడు నాన్నా. ( రామప్పంతులు సీసాకి యడంగా నిలబడును.) రామ : బ్రహ్మరాక్షసి యేవిఁటి? ఓ బ్రహ్మరాక్షసి వొచ్చి - మా అమ్మిని భయపెట్టింది. మీనా : నన్ను కాదు మా నాన్న పీకే పిసికింది. రామ : గవరయగారూ, పిల్ల యావైఁనట్టు? గవర : దాని మొగుడు యగరేసుకు పోయినాడు. మీనా : యక్కడికి యగరేసుకు పోయినాడు? వాడు యీ సీసాలోనే వున్నాడన్నారే? గవర : (కొంచెం ఆలోచించి - చిరునవ్వు నవ్వి) అదీ యీ సీసాలోనే వుంది. మీనా : మనిషి సీసాలోకి యలా వొచ్చింది? గవర : అయ్యో సత్యకాలవాఁ! అది మనిషా అనుకున్నావు? అది కామినీ పిశాచం. అంచేతనే నేను మీ యింటికొచ్చినప్పుడల్లా దూరంగా వెళ్లిపోయేది, యేమి చెప్మా అనుకునేవాణ్ణి. మీనా : యిద్దర్నీ ఓ సీసాలో పెడితే దెయ్యప్పిలల్ని పెడతారేమో? గవర : పంతులుగారూ చిత్తగించండీ, రెండు మనుషుల బలువుందో లేదో చూడండి. రామ : మొట్టో! నా దగ్గిరకి తేకయ్యా. గవర : అసిరిగా నువ్వు పట్టుకో. అసిరి : నాకు బయవేఁటి? పైడితల్లి చల్లగుండోలి - (సీసా పట్టుకుని) ఓలమ్మ! యంతంత బలువుందోస్సి! గవర : సీసా, అఖండం, తులిసికోట దగ్గిరదించు. లుబ్ధా : బాబ్బాబు! సీసా నా యింట్లో పెట్టకు, మీ యింట్లో పెట్టించండి. గవర : మా పిల్లలు తేనెసీసా అని బిరడా తీసినట్టాయనా, రెండు దెయ్యాలూ వొచ్చి మళ్లీ మీ యింట్లోనే వుంటాయి. లుబ్ధి : అయితే, సీసా భూస్థాపితం చెయ్యండి. గవర : భూస్థాపన మజాకాలనుకున్నారా యేమిటి? భూస్థాపితం చెయ్యడానికి యంత తంతుంది! పునశ్చరణ చెయ్యాలి, హోమం చెయ్యాలి, సంతర్పణ చెయ్యాలి. లుబై : నా యిల్లు గుల్ల చెయ్యాలి! గురుజాడలు కన్యాశుల్కము - మలికూర్పు 339