పుట:Gurujadalu.pdf/376

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సిద్ధాం: ఆటపారెయనా? పోలి : బుచ్చింది; బుచ్చింది. లెంపలోయించుకుంటాను. మరి మాటాడితొట్టు పూజారి: మా మధురవాణి మీద ఆశుకవిత్వం చెబుతాను. డైమనురాణీ?! రాణా, యిస్పేటు రాణి? రాణి కళావ| రాణా, ఋణా అధీశ్రణీ?" రాణి యనన్మధురవాణె, రాజులరాణీ సిద్ధాం: గవరయ్యా! యేంవిలవైన పద్యం చెప్పావోయి! నీ మీద నేను పద్యం చెబుతాను- విను. “గవరయ్యా! నీ సరి మరి! యెవరయ్యా?” పూజారి: యెవరు లేరు, యిచ్చోనయ్యా! సిద్ధాం : యిదుగో రాజు. పోలి : యిదుగో పాలు. (మధురవాణి తురుపురాణీ వేయును.) పోలి : అదుగో, అదుగో, యీ బాపనాడు కపీశం శెప్పి, మధురవోణి దగ్గిర రాణీ వుందని శెప్పేశాడు. గోరం. గోరం. గవరయగానీ మాటాడితే నే ఆటాఱు. పూజారి : పోలిశెట్టి మీద కవిత్వం చెప్పి చాలా రోజులైంది (పొడుం పీల్చి) “పోలిశెట్టి ముఖము - పోలిరొట్టెను బోలు! పోలిశెట్టి ముక్కు పొడుముడొక్కు!” పోలి : వొద్దు! వొద్దు! వొద్దు! నా మాటిను. పాసం పెట్టి సంపేస్తావాయేటి? ఊరుకుంటి వొట్టాయినా, యిన్నావా? యీ ఆట సిద్ధాంతి బేసెట్టి, నేను గెలిస్తే, నీక్కాండబ్బిస్తాను. మరూరుకో. సిద్ధాం : నీ సొద తగలడా - తురుపు మిగిలిపోయింది; బేస్తు (ముక్కలు చూపించి పారవేయును) పోలి : ఆఁ! మూడో యెత్తడబ్బేస్తు. గాపకాలుంచుకోండయ్యా, చేతి వొరస, మంచి ముక్కలైయి, బాపనాడా అంతసేపు కలపడవాఁ? గోరం, గోరం. సిద్ధాం : బులబులాగ్గా కలిపి, బేస్తు నీకిస్తాననుకున్నావా? పోలి : తోలుసేత్తో, ముక్కలేసినావు! “నరిసింవ్వ, నీదివ్వె నామమంతరముశాత, నరిసింవ్వ నీదివ్వె-" గురుజాడలు కన్యాశుల్కము - మలికూర్పు 331