పుట:Gurujadalu.pdf/375

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పోలి : ఒక్కటీ. మధు : ఒకటి. భుక్త :వకటి. (సిద్దాంతి ఆలోచించును) పోలి : యే టాలోసిస్తావు చేతరస! యెత్తవయ్యా. సిద్ధా : నీదేం పోయింది! రెండు. పోలి : లాంతరేశావు. యేటెత్తను? రొండు. మధు : రెండు భుక్త : రొండు (సిద్ధాంతి ఆలోచించును.) పోలి : యేటాలోసిస్తావు ? చేతరస : యెత్తి బేస్తు గెలుసుకో. సిద్ధా: నువు చెప్పావు గనక యెత్తుతాను. పోలి : ఆఁ! డబ్బక్కపెట్టి మరీయెత్తు. మూడో యెత్తడపు బేస్తు; గాపకవుఁందా! బేస్తు మీద కుదేలెట్టిఁ బాకీ లెట్టి, యగేయడానికా? సిద్ధా : (తన ముక్కలు యెత్తు ముక్కల మీద వేసి) కోవఁటాడి పిలక నిగుడుతూంది! పోలి : తంతావాయేటి? సిద్ధా : తన్నడవఁంటే, ఒహలాగనా? పోలి : నా ఆట శెడగొట్టేశినావు బాపనయ్యా! భుక్త : ముక్కలు పడలేదని యేడుస్తూ, మళ్ళీ యేవిఁటి, ఆట చెడగొట్టాడని యేడుస్తావు ? పోలి : యీ ఆట బేస్తు చేయించకపోతే నా పేరు - సిద్ధా

కోవఁటాడా, నోరు మూసుకుంటావా, మూసు కోవా?

పోలి : తెల్లాడిబావుటా యెగురుతుండగా, నీజులువేఁటి? ముక్కలియ్యడం యింతసేపైతే, మరాటేటి? సిద్ధా: నువ్వుగానీ మళ్లీ మాట్లాడావంటే, ముక్కలు కలిపెస్తాను. (పోలిశెట్టి “నేను మాటాడను; నువ్వు ఆడు,” అని సౌజ్ఞ చేయును. సిద్ధాంతి ఆడును) పోలి : మూడే తురుపులు పడ్డాయి బాపనాడా; "తమాషాదేఖో, లంకకే రాజా! గురుజాడలు కన్యాశుల్కము - మలికూర్పు 330