పుట:Gurujadalu.pdf/373

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మీనా : దానమ్మ కడుపు కాలా, చెయ్యి కరిచేసింది నాన్నా - రక్తం బొట బొట కారుతూంది. దీన్ని హతవాఁరుస్తాను. లుబ్ధా : యంత దారణప్పని చేసిందీ, ముండ! యేదమ్మా చెయ్యి (గుడ్డ పీరికతో రక్తంతుడిచి), మొహురడిగావు గదా యక్కడిదేవిఁటి? మీనా : ఆతండ్రి వెధవ నాకిమ్మని యీ ముండ చేతికి యిచ్చాడు. దీని నక్కవినయాలు చూసి నా పెట్టా బాడా దానికే వప్ప జెప్పి, ఆ మోహురు దాన్నే దాచమన్నాను. అనుమానవేఁ సి యిప్పుడు నా మోరు తెమ్మంటే, “బట్టలపెట్లో పెట్టాను, తాళం పోయింది” అంది. తాళం తాకపోతే రోకలితో బుజ్జి చితకబొడుస్తాను. లుబ్ధా : చెయిజేసుకోకు. నీది వెఱ్ఱకోపం. చావగొట్టగలవు జాగ్రత! మీనా : చస్తే యీడిచిపారేస్తాను. ముండయలా కరిచిందో చూడండి. యింకా రక్తం కారుతూంది. మనిషి కాటుకి మందులేదన్నాడు. లుబా : కుంకుం పెట్టమ్మా. మీనా : దాని బుజ్జి చితకబొడిచి మరీ పెడతాను (మీనాక్షి వెళ్లును) లుబ్ధా : గుండుగొమ్ముల అనుమానం తీరిపోయింది పీకనులివిఁ, వాడైనా చంపేస్తాడు; కరిచి అదైనా చంపేస్తుంది. వీడిచేతో, దానిచేతో, చావు తప్పదు. యెంత డబ్బెట్టి కొనుక్కున్నాన్రా, యీ చావు పెళ్లీ! అయ్యో! అయ్యో! దీన్ని పైకి తగిలేస్తే వాడు కూడా విరగడై పోతాడు. అదే సాధనం - యెక్కడికి తోలెయ్యను? బండీ మీద యెక్కించి పట్టం తోలేస్తాను - అక్కడ గానీ తండ్రి వెధవ కనపడకపోతే మళ్లీ దెయ్యాన్ని నెత్తిని పెట్టుకుని ప్రత్యక్షం అవుతుందే! బండిఅద్దె యిచ్చుకోవడవేఁ మిగుల్తుంది. యేమి సాధనం? - యేమి సాధనం? రావఁప్పంతుల్ని సలహా అడుగుదునా? ఆ! మంచి ఆలోచన తోచింది - రావఁప్పంతులు నాకు కట్టి పెట్టిన యీ ముండని, వాడి దగ్గరికే పంపించేస్తాను - సానిదాంతో పాటు దీన్ని కూడా వుంచుకుంటాడు కావలిస్తే పదిరూపాయలు దక్షణతో కూడా యిచ్చేస్తాను. (మీనాక్షి ప్రవేశించి.) మీనా : యక్కడా కనపడదు నాన్నా లుబ్దా నూతులో పళ్లేదు గద? మీనా : యేమో ! లుబ్దా : పరిగెత్తెళ్ళి గవరైని పిలవమను. దాన్ని నువ్వు చావగొట్టలేదు గద? కన్యాశుల్కము - మలికూర్పు గుంట.

గురుజాడలు 328