పుట:Gurujadalu.pdf/374

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మీనా : కనపడితేనా? లుబై : యేవిఁటి నాయనా, యీ కొత్త ఉపద్రం! (నిష్క్రమింతురు.)

9వ స్థలము : రామప్పంతులు యింట్లో కొట్టు గది భుక్త, పోలిశెట్టి, సిద్ధాంతి, మధురవాణి పేకాడుచుందురు. పూజారి గవరయ్య ఆట చూచుచుండును. పోలిశెట్టి :యేం భష్టాకారి ముక్కలు యేశావయ్యా! యెప్పుడూ నువ్వింతేను. భుక్త : చూసివేశానా యేవిఁటి? నీ దరిద్రదేవతని తిట్టు. పోలి : గవరయ్యా, నీ ముణుకు నా దగ్గిర యిలా యెట్టకు. లేచిపో, నీ పుణ్యవుఁంటుంది. గవ : నేను మా మధురవాణి దగ్గిర కూచుంటాను. భుక్త : చూడూ, ముక్క తప్పుపడ్డట్టుంది. పోలి : ఆఁ! బాపనయ్య పంచాలని తప్పు పంచుతున్నావు. తప్పు పంచితే బేస్తు మీద కుదేలెట్టిస్తాను. భుక్త : ముక్కలు బాగా పడలేదన్నావే? పోలి : రెండో యేత నాలుగా సులడకూడదా? భుక్త : పోలిశెట్టికి ముక్కలు వేస్తూ యిదుగో నాలుగాసులేస్తున్నాను. జుజ్జు. పోలి : నీ యిషప చేత్తో మేస్తే, పొల్లు ముక్కలే పడతాయి; మంచి ముక్కలడతాయా? భుక్త : తథాస్తు! పోలి : అలా అనకు. యెంతశెట్టి బొపనాడి శాపనాకారం మారెడ్డది. (చూచుకొని) శ్రీ! భష్టాకారి ముక్కలు! సిద్ధాంతి : ఒకటి, రెండు. పోలి : అదుగో, అలాశెప్పితే నేవొప్పను. ఒక్కొకటి శెప్పాలి. సిద్ధాంతి: అయితే వకటి. గురుజాడలు 329 కన్యాశుల్కము - మలికూర్పు