పుట:Gurujadalu.pdf/333

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మధు : యంత్రం యెదురు దిరిగిందో? ఐతే చక్రం అడ్డువేస్తాను (మధురవాణి తొందరగా వీధిలోకి వెళ్లును) రామ : యిదెక్కడికి పారిపోతూంది? యిదే చెప్పేశింది. దొంగపని చేసినప్పుడు రెండో వారితో చెప్పకూడదు. వెధవని చెవులు నులుపుకుంటాను. పరిగెత్తి వెళ్లి చేతులో కాగితం నులుపుకొత్తునా? - గాడిదకొడుకు కరిస్తే? పోయి మీనాక్షి కాళ్లు పట్టుకుంటాను. (మధురవాణీ వక చేతితో వుత్తరము, వక చేతితో లుబ్ధావధాన్లు చెయ్యి పట్టుకుని ప్రవేశించును.) మధు : (రామప్పంతులుతో) చాలు, చాలు, మీ ప్రయోజకత్వం. బావగారికి అన్నా, తమ్ముడా, కొడుకా, కొమ్మా! మిమ్మలిని ఆప్తులని నమ్ముకుని, సలహాకి వస్తే, ఆలోచనా సాలోచనా చెప్పక, ఏకవచనం, బహువచనం, అని కాష్టవాదం పెట్టారు. బావా! కుర్చీ మీద కూచోండి. (కుర్చీమీద కూచోబెట్టి) (రామప్పంతులుతో) యీ వుత్తరం యేవిఁటో నింపాదిగా చదివి చూసుకోండి. (వుత్తరం రామప్పంతులు చేతికి యిచ్చును. ) రామ : (వుత్తరం అందుకుని తనలో) బతికాన్రా దేవుఁడా (చూచుకొని). అరే నా ఉత్తరవేఁ కాదే యిదీ. నా నీడ చూసి నేనే బెదిరాను (పైకి) మావాఁ! వొస్తూనే తిట్లతో ఆరంభిస్తే యెంతటి వాడికైనా కొంచం కోపం వొస్తుంది. నెమ్మదిగానూ, మర్యాదగానూ నన్నొచ్చి యేం సహాయం చెయమంటే అది చెయనూ? లుబ్ధా : మరైతే యీ పటాటోపం వొద్దని రాయండి. అతగాడికి పటాటోపం కావలిస్తే ఆ ఖర్చంతా అతగాడే పెట్టుకోవాలి. మధు : (లుబ్ధావధాన్లు, జుత్తు ముడి విప్పి దులిపి) యేం ధూళి! సంరక్షణ చేసేవాళ్ళు లేకపోబట్టి గదా? (గూటిలో నుంచి వాసననూనె దువ్వేనా తెచ్చి తలదువ్వుచుండును. ) రామ : (ఉత్తరం తిప్పి కొసచూసి చదువును) “శేవకుడు తమ్ములు గిరీశం” - వీడా! మధు : పైకి చదవండి. రామ : నీ గిరీశం, అనగానే పైకి చదవాలేం? మధు : అయితే, మీరే చదువుకు ఆనందించండి. లుబ్దా

“నీ గిరీశం” అన్నారేం?

రామ : అది వేరే కథ. లుబ్దా : పైకి చదవండి. గురుజాడలు 288 కన్యాశుల్కము - మలికూర్పు