పుట:Gurujadalu.pdf/332

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లుబ్ధా : (చేతిలోని వుత్తరమును ఆడిస్తూ) యీ కుట్రంతా నీదే. రామ : (తీక్షణంగా మధురవాణి వైపు చూసి, లుబ్ధావధాన్లుతో) కోపం కోపంలా వుండాలి గాని, యేకవచన ప్రయోగం కూడదు. లుబా : యిదంతా మీ కల్పనే. నా కొంప ముంచడానికి తలపెట్టారు, చదవండి. రామ : (వుత్తరం అందుకోక కుర్చీ వెనక్కి తీసుకుని) ఆ వుత్తరం సంగతి నాకేం తెలుసును? లుబ్ధా : చేసినవాడివి, నీకు తెలియకపోతే, యెవరికి తెలుస్తుంది? రామ : అదుగో మళ్ళీ యేకవచన ప్రయోగం! మెత్తగా మాట్లాడుతున్నానని కాబోలు ఆనాడీ చేస్తున్నారు? వుత్తరం గిత్తరం నేను కల్పించానని, మళ్లీ అన్నారంటే కథ చాలా దూరం వెళుతుంది. ఆ సంగతి మట్టుకు కాని వుండండి. రామప్పంతులు తడాఖా అంటే యేవలనుకున్నారో? లుబ్ధి : నువ్వు రామ : అదుగో మళ్లీ. లుబ్దా:

మీ కల్పనైతేనేం, మరొహరి కల్పనైతేనేం, బుద్ధి పొరపాటు నాది. మధ్య వెధవలతో

నాకేం పని? వెంటనే బయల్దేరిపోయి, ఆ అగ్నిహోత్రావధాన్లునే అడుగుతాను. రామ : మాటలు మా జోరుగా వొస్తున్నాయి జాగ్రత. (లుబ్ధావధాన్లు వెళ్లును) నన్నేనా వెధవలు అంటున్నాడు? మధు : నన్ను కూడా కలుపుకోవాలని వుందా యేవిఁటండి? రామ : నన్ను మట్టుకు వెధవని కింద కట్టావూ? మధు : నేవుండగా వెధవలు మీరెలా అవుతారు? రామ : నన్ను సప్త వెధవని చేశావు. మరి యింకా తరవాయి యేం వుంచావు ? మధు : అదేవిఁటి ఆ మాటలు? రామ : ఆ వుత్తరం నేను బనాయించానని, ఆ వెధవతో యెందుకు చెప్పావు ? మధు : మీ తోడు, నేను చెప్పలేదే? రామ : మరి నేను బనాయించానని, వాడికెలా తెలిసింది? మధు : యెందుకీ ఆందోళన? రామ : మరి, ఆ వెధవ ఆ వుత్తరం తీసికెళ్ళి అగ్నిహోత్రావుధాన్లుకి చూపిస్తే, నా మీద వాడు వెంటనే ఫోర్జరీ కేసు బనాయిస్తాడే? వీక తెగిపోతుంది? యేవిఁటి సాధనం? గురుజాడలు 287 కన్యాశుల్కము - మలికూర్పు