పుట:Gurujadalu.pdf/326

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అగ్ని : అషైతే చిన్న చెట్లెక్కించండి గాని పెద్దచెట్లప్పుడే యక్కనియ్యకండి. గిరీశం: అంచేతనే జామచెట్టు యక్కమన్నాను. చూశారా? అగ్ని : ఓరి! కోతి వెధవా! గిరీశం: అదుగో తిడుతున్నారూ? దొర్ల చదువు చదువుకుంటే, దొర్ల తరిఫీదు యివ్వక తప్పదు. మీరిలా తిడితే భయపడి కిందపడతాడు; యిలాంటి పనులు మీకిష్టం లేకపోతే, యింగిలీషు చదువు మానిపించి వేదం చెప్పండి.

మరిచిపోయి తిట్టాను. యీ యింగిలీషు వాళ్ల సంగతంతా అదో వెట్టిమొట్టి,

గిరీశం: మీవంటి ప్రాజ్ఞులు అలా అండం నాకు ఆశ్చర్యంగా వుంది. వాళ్ల నడవడిక మంచిదవడం చాతనే దేవుఁడు యింత రాజ్వైశ్వర్యం వాళ్లకిచ్చాడు. మనశాస్త్రాల్లో మాటలు మనం మరిచిపోయినావు.. ఆ మాటలే తెల్లవాళ్లు దొంగతనంగా పట్టుకు పోయి, శాస్త్రం చెప్పినట్టల్లా ఆచరించి మన రాజ్యం లాగుకున్నారు. మీరు యెరిగిన వారుగదా చెప్పండి, గురువులు దగ్గిర శిష్యులు యేంచేశేవారు? అడివికెళ్లి చెట్లెక్కి, సమిధలు తెచ్చేవారు. రండికీ మొండికి ఓర్చేవారు. యిప్పుడు యింత ప్రాజ్ఞులైన మీరేవఁంటు న్నారూ? మా వాడు యిల్లు కదిలివెళ్లితే కందిపోతాడు, మా వాడు జావఁచెట్టెక్కితే కాళ్లు విరుచుకుంటాడు అని భయపడతున్నారు. మీ శిష్యులు బ్రహ్మాండవైఁన మజ్జిచెట్టు కొనకెక్కి ఆకులు కోసి తెస్తున్నారు కారా? మన పుస్తకాల్లో మర్మం కనుక్కుని దొర్లు బాగుపడుతున్నారు, మన పుస్తకాలు బూజెక్కించి మనం చెడుతున్నాం. అగ్ని : మీకు చాలా తెలుసును. యీ తెల్లవాళ్లు చేసే విద్యలన్నీ మన గ్రంథాల్లోంచి యెత్తుకెళ్లి నవే. యీ రెయిళ్లు, గియిళ్లూ యావత్తు మనవేదంలో వున్నాయిష. మీది మాపరిశీలనైన బుద్ధి. మనకేసు గెలవడానికి మీరు రాసిన సవబులు మా బాగున్నాయి. గిరీశం: యింకా బాగుండును. రికార్డు పూర్తిగా లేదు. కొన్ని కాగితాలు మీరే పారేశారో, మీ వకీలు వుంచేసుకున్నాడో నాకు బోధ పడకుండా వుంది. అగ్ని : నేను పారెయ్యలేదండీ. నాకు యింగిలీషు తెలియకపోవడం చాలా చిక్కొచ్చింది. గిరీశం: మీకే యింగ్లీషు వొస్తె భాష్యం అయ్యాంగార్లా అయిపోరా? యీ మడి తడిపేసి, వున్న కాగితాలు యావత్తుకూ జాబితారాస్తాను, తమరు వెళ్లండి. అగ్ని : మీరు సంసారం పనిపాట్లు యేం శ్రద్ధగా చేసుకుంటారు! మా వాడికి మీలా ప్రయో జకత్వం అబ్బితే నాకొహడి అవసరం వుండదు. దిగేటప్పుడు నిమ్మళంగా సాయం చేసి మరీ దింపండేం? కీడించి మేలించమన్నాడు. (నిష్క్రమించును. ) కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 281