పుట:Gurujadalu.pdf/327

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వెంక : (నిమ్మళంగా) నాన్న యింట్లో కెళ్ళిపోయినాడు. గిరీశం: నిమ్మళంగా దీగు. వెంక : (వురికి) బతికించారు. (వెళ్లిపోబోవును) గిరీశం: ఆగు ఆగు ఆవొళ్లో పళ్లిలా పట్రా. వెంక : దొబ్బుతారా యేవిఁటి అన్నీని? అన్యాయం! గిరీశం: "అన్యాయం పాపనాశనం” అన్నాడు. ఒక్క అన్యాయంతో పాపాలన్నీ పోతాయి. అన్ని పళ్లూ నువు మాత్రం తింటావాయేమిటి? తింటే స్టమకేక్, కడుపు నొప్పొస్తుంది. కడుపునొప్పొస్తే మీ అమ్మ నోరు పగల్దీసి సోలడు ఆవఁదం వసగుండా గొంతుకలో పోస్తుంది. వెంక : నేనావఁదం తాగను. గిరీశం: అలా అయితే పళ్లట్టే తినకు (యాతాం వొదిలి వెంకటేశం వొళ్లోని కాయలు యెంచుచుండును) వెంక : (యేడుపు మొహంతో) పెద్ద పళ్లన్నీ దొబ్బుతారా యేవిఁటి? గిరీశం: పెద్దవాళ్లకి పెద్దపళ్లూ, చిన్నవాళ్లకి చిన్నపళ్లూ, యింతసేపూ చెట్టెక్కి చిలకలా కొరికావు చాలా? (నాలుగు పెద్దపళ్ళు తీసుకొని వెంకటేశం వీపుతట్టి) మైడియర్ బ్రదరిన్లా! యహ నీ యిష్టవొచ్చినట్టు చెట్లూ చావఁలూ యెక్కు యింగిలీషువాడు నేచర్ స్టడీ చెయ్యమన్నాడు. జామచెట్టెక్కి నప్పుడు మాత్రం పండూ, పరువుకాయా, పచ్చికాయా వీట్ల భేదం బాగా స్టడీ చేసి, పళ్లే కొయ్యి, అందులో నాలుగు గురుదక్షణ కింద నాకియ్యి. లేకుంటే కడుపుబ్బుతుంది. నువ్వొహ మాటు చెట్టెక్కింతరవాత, వలేసి చూసినా మరి పరువు కాయ కనబడదు. “యేరకుమీ కసుగాయలు” అన్నాడు. రనెవే! (వెంకటేశం దాటు వేసి పారిపోవును). పాచిక పారేటట్టే కనపడుతూంది. హా! యేమి సొగసు! క|| నదమాపొక్కిలి, జాంబూ | నదమామైచాయ, కోకనదమా పదమా| పదమాజడ, నడుమువియత్ | పదమా, నూగారు గూఢ పదమా చెలికిన్ | (నిష్క్రమించును.) గురుజాడలు 282 కన్యాశుల్కము - మలికూర్పు