పుట:Gurujadalu.pdf/323

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పణ్చుండోవన్నె బంగారం అవునంటారా కాదంటారా? బంగారం విలవ యెక్కువా వెండి విలవ యెక్కువా? చప్పండి. బుచ్చమ్మ: బంగారవేఁ యెక్కువ గిరీశం: సరే, మీలాంటి బంగారం బొమ్మే లభించినప్పుడు లోకం గీకం అవతలబెట్టి పెళ్లాడక తీరదుగదా. మాటవరసకి మనం పెళ్ళాడతాం అనుకొండి. పెళ్లాడింతరవాత సంసారం సుఖంగా జరుపుకోవాలంటే లావుగా డబ్బుండాలి గదా? ఉద్యోగం చేస్తే గాని డబ్బులావుగా రాదే? బుచ్చమ్మ: అవును. గిరీశం: అట్టే డబ్బెందుకని అడుగుతారు ఒకవేళ, చెబుతాను వినండి. సంసారానికి యిల్లన్నది ఒకటుండాలి గదా? యేవఁంటారు? బుచ్చమ్మ: అవును. గిరీశం: నాకు మేడలుంటేనే గాని కుదరదు. యిలాంటి చిన్న ఇళ్లలో నాకు ఉక్కిరి బిక్కిరిగా వుంటుంది. ఆ మేడ చుట్టూ తోట వుండాలి. మావిడి చెట్లూ, అరిటి చెట్లూ, జామిచెట్లూ, చెప్పన్ని వృక్షాలూ వేస్తాం. మన వెంకటేశం కోతిలాగ పళ్లు తింటూ యెప్పుడూ చెట్ల మీదే వుంటాడు. వెంక : ఆ చెట్ల పళ్లన్నీ నేనే కోస్తాను. గిరీశం: అంతవాడివి కావనా? మనం అలాగ యిల్ల, వాకిలీ, తోటా, దొడ్డీ, యార్పరుచు కునేటప్పటికి మనకి చిన్నపిల్లలు పుడతారు. వాళ్లని సంరక్షణ చెయ్యాలా? వాళ్లు నేను కుర్చీ మీద కూచుని రాసుకుంటూంటే వొచ్చి చెయ్యిబట్టుకు లాగి నాన్నా యిదీ కావాలి అది కావాలంటారు. మీరు బీరపువ్వుల్లాగ వొంటి నిండా సరుకులు పెట్టుకుని, చక్కగా పసుపూ కుంకం పెట్టుకుని, మహాలక్ష్మీ లాగ యింట్లో పెత్తనం చేస్తూ వుంటే ఒక పిల్ల యిటివేపు వొచ్చి మెడ కాగలించుకునీ, ఒక పిల్ల అటు వేపు వొచ్చి మెడ కాగలించుకుని “అమ్మా యిది కావాలి, అమ్మా అది కావాలని” అడుగు తారు. వాళ్లకి సరుకూ జప్పరా చేయించాలి, జరీ దుస్తులు కుట్టించాలి. గిరీశం గారి పిల్లల్ని తీసుకురా అని ఒకప్పుడు నవాబుగారి శలమౌతుంది. మన పిల్లల్ని వెంకటేశంలాగ కాయగావంచా, తెల్లచొక్కాయితో పంపించడానికి వల్ల కాదుగదా? వాళ్లకి చిన్నబళ్ళూ, గిళ్లూ కొనాలి. వాళ్లకి చదువూ సంధ్యా చెప్పించి ప్రయోజకుల్ని చెయ్యాలి? యిదంతా సంసార తాపత్రయం కాదా? యిందులో పడిపోతే మరి కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 278