పుట:Gurujadalu.pdf/322

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చేస్తే గదా లోకోపకారం అవుతుంది. పెళ్లాం బిడ్డలు వుంటే వాళ్లని వొదిలి యలా పోవడం? అయితే పెళ్లాడమని మీరు చెప్పిన మాట కూడా సుతరామూ కొట్టి పారేయ కూడదు. లోకానికోసం బతకడం ఉత్తమం. అయితే లోకం అంతా యంత విలవో అంత కన్న యెక్కువ విలవైన రత్నం లాంటి ఆడమనిషి దొరికితే, తప్పకుండా పెళ్లాడవలిసిందే. యీ వూరొచ్చేవరకూ నాకలాంటి దివ్య సుందర విగ్రహం, కనపర్లేదు. మొహవెఁదట చెప్పకూడదు. అలాంటి మనిషి ఈ వూళ్లో కనపడ్డది; అందరాని పండుకు ఆశించడవెఁందుకని మనసు మళ్లించుకోడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాను గాని మనస్సు లొంగకుండా వుంది. భగవంతుడేం జేస్తాడో! మనస్సుతో యావఁ ంటున్నానంటే, “ఓ వెడ్డి మనసా! నువ్వు వలచిన చిన్నది ఆణిముత్యవేఁగాని యిన్నాళ్లూ పెళ్లి మానేసి యిప్పుడు “పెళ్లాడదాం, పెళ్లాడదాం” అని యెందుకు సందడిపడతావు? “సంసార సాగరం దుఃఖం, తస్మాజాగ్రత జాగ్రత” అన్నాడు. సంసారంలో పడిపోతే మళ్లీ నీకు లోకోపకారం చేయడానికి అవకాశం వుంటుందా?” అని మనస్సుకి బోధ పరుస్తున్నాను. పెళ్లాడితే లోకోపకారానికి అవకాశం యంతమాత్రం వుండదు. చూశారా వదినా! మాటవరసకి మనం పెళ్లాడతాం అనుకుందాం. సంసారం గడుపుకోవడానికి డబ్బు సంపాదించుకోవాలా? యిదివరకల్లా అంటే బ్రహ్మచర్యం ఆచరిస్తున్నాను. గనక “సత్రా భోజనం, మఠానిద్రా” సరిపోయింది. మాటవరసకి మిమ్మల్ని పెళ్ళాడింతరవాత, అలా సరిపోదే! మనం గాని మావఁగారి మూర్భానికి లక్ష్యపెట్టక, యవరితోనూ చప్పకుండా రామవరం వెళ్లిపోయి అక్కడ శాస్తోక్తంగా పెళ్లాడావఁంటే, ప్రస్తుతం మట్టుకు విడో మారియేజి సభ వారు మనకి నెలకి నూగ్రూపాయలు యిస్తారు. ఓ నాలుగయిదు మాసాలు అలా కాలక్షేపం చేసి, హైదరాబాదులోగాని బడోదాలోగాని ఓ వెయిరూపాయల వుద్యోగం సులభంగా సంపాదించుకుంటాను. హయిదరాబాదు నవాబు నెలరోజుల కిందట పెద్ద ఉద్యోగ విఁస్తానన్నాడు. “నేను ఒకడి దగ్గర నౌఖరీ చేస్తానా?” అని విజ్ఞవీగి తోసిపారేశాను. మీరు వివాహం చేసుకోమని సలహా యిస్తారని అప్పుడే యెరిగి వుంటే ఆ ఉద్యోగం మించిపోనియ్యకపోదును. బుచ్చమ్మ : మీరు ఉద్యోగం చెయ్యరన్నాడే, తమ్ముడు? గిరీశం: అవును బ్రహ్మచారిగా వుండి లోకోపకారం చేస్తూ వున్నంతకాలం పెళ్లి చేసుకోనని శపథం పట్టాను. గాని, యిప్పుడు నా అదృష్టం వల్ల లోకం అంతటి కన్నా విలవైన వజ్రంలాంటి భార్యా దొరికితే పెళ్లాడక తీరుతుందా? లోకం యొక్క విలవ వెండి అనుకోండి, లోకం వెండైతే మీలాంటి సువర్ణచ్ఛాయగల కుందనపు బొమ్మ, కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 277